చిన్నప్పుడే దాన్ని అలవాటు చేయొద్దు  

  • ప్రపంచవ్యాప్తంగా కాఫీ తాగే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. కాఫీ వలన లాభాలున్నాయి అనేది ఎంత వాస్తవమో, కాఫీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే నష్టాలున్నాయి అనేది కూడా అంతే వాస్తవం. ఈ కాఫీ అనేది ఒక వ్యసనంలా మారిపోతోంది చాలామందికి. ఈ వ్యసనాన్ని చిన్నప్పుడే పిల్లలకి అలవాటు చేయొద్దు. ఎందుకంటే చిన్నపిల్లలు దేన్నైనా చాలా త్వరగా అలవాటు చేసుకుంటారు. కాఫీ వ్యసనపరుల్లో చాలామందికి బాల్యం నుంచే కాఫీ అలవాటు ఉంటుంది.

  • కాఫీ చిన్నప్పుడే అలవాటు చేస్తే పిల్లలు లావుగా అలవాటు అయ్యే ప్రమాదం ఉంటుంది. పిల్లల్లో కాఫీ అలవాటు వలన నరాల బలహీనత, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు పెరుగుతాయట. అలాగే కాఫీ అలవాటుని తట్టుకునే శక్తి పిల్లల దంతాలకి ఉండదు. కాబట్టి బాల్యంలో కాఫీ కప్పు మీ పిల్లల చేతిలో పెట్టొద్దు.

  • కెఫైన్ ఒక డ్రగ్ లాంటిది. కాఫీ తాగిన కాసేపటికే మళ్ళీ కాఫీ తాగాలని అనిపించేది ఈ గుణం వల్లే. అలాంటి వ్యసనాన్ని చిన్నప్పుడే అలవాటు చేయడం చాలా తప్పు. పిల్లలు ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండాలి. కెఫైన్ పై మక్కువ నీళ్ళపై ఆసక్తి తగ్గిస్తుంది. ఇది చాలా ప్రమాదం. అందుకే పిల్లలకి పాలు తాగించడమే కరెక్టు.