కరోనా నుంచి రక్షించుకునేందుకు ముక్కుకు కొబ్బరి నూనె అంటూ మెసేజా.. జర జాగ్రత్త సుమీ..!

ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ వల్ల ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంటుంది.కొందరు అపోహలకు పోయి సొంత వైద్యానికి ప్రాధాన్యతను ఇస్తున్నారు.

 Coconut Oil Message To Protect The Nose From The Corona .. Zara Caution Sumi ..-TeluguStop.com

తమకు ఇష్టం వచ్చిన మందులను ఇంట్లోనే తయారు చేస్తు తమతో పాటు ఇంట్లో వారి ఆరోగ్యాలను దెబ్బతిసే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.కరోనాలాంటి మహమ్మారిని తట్టుకోవడానికి రోగ నిరోధక శక్తి పెంచుకోవడం, ఆక్సిజన్‌ స్థాయిని ఏ విధంగా ఉంచుకోవాలనే దానిపై దృష్టి పెట్టకుండా సోషల్‌ మీడియాలో వచ్చిన, వాట్సప్‌ గ్రూప్‌లో వచ్చిన ప్రతీ దానిని అనుసరిస్తూ సొంత వైద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

కొందరైతే ముందస్తుగానే కరోనా తమకు రాకూడదని మం దులను వాడుతున్నారని వైద్యులు పేర్కొంటున్నారు.ఇలా వాడిన కొంద రు అనారోగ్య బారినపడి ఆసుపత్రులకు వచ్చి చికిత్సలు పొందుతున్నారని అంటున్నారు.

ఇలాంటివి నమ్మొద్దని తెలుపుతున్నారు.

తాజాగా సోషల్ మీడియాలో ఓ మెసేజ్ వైరల్ అవుతోంది.

ప్రముఖ ఫార్మా కంపెనీ బయోకాన్ చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ మజుందార్ షా పేరుతో ఇది వైరల్ అవుతోంది.కోవిడ్ మహమ్మారి నుంచి తనను తాను రక్షించుకునేందుకు

ముక్కుకు కొబ్బరి నూనెను రోజుకు

నాలుగు సార్లు రాసుకుంటున్నట్లుగా అందులో ఉంది.

ఈ మెసేజ్‌ ఓ వాట్సాప్ లింక్ నుంచి లింక్డ్ఇన్‌తోపాటు ఇతర సోషల్ మీడియాల్లో షేర్ అవుతోంది.అయితే వైరల్ అవుతున్న మెసేజ్ పై బయోకాన్ కెంపెనీ స్పందించింది.

ఇది పూర్తిగా తప్పుడు సందేశం అంటూ పేర్కొంది.“#FakeForwardAlert: కిరణ్ మజుందార్ షా పేరిట ఒక నకిలీ సందేశం వాట్సాప్‌లో పోస్ట్ చేయబడుతోంది, అందులో తప్పుడు సమాచం ఉందని తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పేర్కొంది.ఇది నకిలీ సందేశం మాత్రమే కాకుండా కిరణ్ ఎక్కడా అంటి విషయాన్ని చెప్పలేదు.దయచేసి దీనిని వారి సలహాగా పరిగణించవద్దు.#StaySafe” అంటూ పేర్కొంది.అయితే ఇలాంటి తప్పుడు మెస్సేజులు నమ్మవద్దని ప్రజలకు సూచించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube