కొబ్బరినూనె విషంతో సమానం అని వ్యాఖ్యలు చేసిన లేడీ ప్రొఫెసర్..నెటిజన్ల ఆగ్రహం..  

Coconut Oil Is Pure Poison Says Harvard Professor Karin Michels-

కొబ్బరి ఎంతో కాలంగా మన దైనందిన జీవితంలో భాగమైంది.ఆహారంగా,అవసరంగా మారింది.కొంచెం అలసటగా అనిపించినా తక్షణ శక్తికి కొబ్బరినీళ్లు తీసుకుంటాం.పచ్చికొబ్బరి ,ఎండుకొబ్బరి రెండు రకాల్ని వంటల్లో వాడతాం.కొన్ని దేశాలు,మన దేశంలోకేరళ కొబ్బరి నూనెను కూడా వారి ఆహారంలో ప్రధానంగా ఉపయోగిస్తాయి.అటువంటి కొబ్బరినూనెని విషం అంటూ వ్యాఖ్యానించింది లేడి ప్రొఫెసర్…సర్వరోగనివారిణి గా పేరుగాంచిన కొబ్బరి నూనె పట్ల మిచెల్ చేసిన వ్యాఖ్యలేంటి ?దానికి నెటిజన్లు ఎలా స్పందిస్తున్నారంటే.

Coconut Oil Is Pure Poison Says Harvard Professor Karin Michels--Coconut Oil Is Pure Poison Says Harvard Professor Karin Michels-

హార్వర్డ్ వర్సిటీకి చెందిన కరిన్ మిచెల్స్ ఇటీవల అమెరికాలో జరిగిన ఓ సమావేశంలో ఏమని వ్యాఖ్యానించిందంటే.‘కొబ్బరినూనె అన్ని రోగకారకాలకు నిలయం.దాన్ని వాడటం మంచిది కాదు.దానికి ఎంత దూరంగా వుంటే అంత మంచిది.మనుషులు తీసుకునే అత్యంత చెత్త ఆహారం ఇదే’ అని వ్యాఖ్యానించింది.కొబ్బరినూనెలో ఉండే గాఢమైన కొవ్వు ప్రమాదకరమైన ఎల్డీఎల్ పరిమామాన్ని పెంచుతుందని ఆమె హెచ్చరించారు.సమతుల ఆహారంలో కొబ్బరినూనెను కొద్ది మోతాదులో తీసుకుంటే ఫరవాలేదని, శ్రుతిమించితే గుండెజబ్బులు తప్పవని ఆమె తెలిపారు.

యూనివర్సిటీ ఆప్ ఫ్రీబుర్గ్‌లో కోకోనట్ ఆయిల్ ఇతర పోషక తప్పిదాలు అనే అంశంపై ప్రసంగం చేస్తూ కొబ్బరి నూనె తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యపరమైన మేలు ఏమిటో ఇంతవరకు శాస్త్రీయంగా రుజువు కాలేదని పేర్కొన్నారు.కొబ్బరినూనెలో 86 శాతం సాంద్రతరమైన కొవ్వు ఉంటుందని, ఇది వెన్నకన్నా మూడోవంతు ఎక్కువని ప్రొఫెసర్ మిషెల్స్ ఉటంకించారు.సాంద్రమైన కొవ్వు వల్ల రక్తంలో ఎల్డీఎల్ పెరిగి గండెజబ్బులు, స్ట్రోక్ రావడం అనేది నిర్ధారణ అయిన విషయమని చెప్పారు.

కొబ్బరినూనె రుచిని ఇష్టపడేవారు కావాలంటే అతితక్కువ మోతాదులోనే వాడాలని ప్రొఫెసర్ మిషెల్ స్పష్టం చేశారు.జర్మనీ భాషలో ఆమె చేసిన ఈ ప్రసంగం వీడియో ఇప్పటిదాకా యూట్యూబ్‌లో పదిలక్షల మంది వరకూ చూశారు.

కరిన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియా సర్వత్రా వ్యతిరేఖత వస్తుంది… ‘భారత్‌లో తల్లులు తమ పిల్లలకు కొబ్బరినూనెతో మర్దన చేస్తారు.ప్రజలు తలకు రాసుకుంటారు.ఒక్క అమెరికాలోనే ప్రతిదాన్నీ భూతద్దంలో పెట్టి చూస్తారు’ అంటూ ఓ నెటిజన్ ఘాటుగా కామెంట్ చేసింది.మరో నెటిజన్ స్పందిస్తూ.కొబ్బరినూనె ఆహారంలో భాగంగా తీసుకున్న ప్రజల ఆయుశ్శు ఎక్కువగా ఉందని కామెంట్ చేశాడు.

కొబ్బరి నూనె విషం అయితే థాయ్‌లాండ్, హవాయి, ఫిలిప్పీన్స్ ప్రజలు తరతరాలుగా విషం తీసుకుంటున్నట్లేనా ? అని మరో నెటిజన్ స్పందించారు.వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : https://youtu.be/Mnc_aoN7lMM