వ‌ర్షాకాలంలో కొబ్బ‌రినూనెను ఇలా వాడితే..ముడ‌త‌లు ప‌రార్‌!

వ‌ర్షాకాలంలో అంటు వ్యాధులు, విష జ్వ‌రాలే కాదు.చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌లు కూడా ఇబ్బంది పెడుతూనే ఉంటాయి.

 Coconut Oil Helps To Reduce Wrinkles In Rainy Season! Coconut Oil, Wrinkles, Rai-TeluguStop.com

అలాంటి వాటిలో ముడ‌త‌లు ఒక‌టి.ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ‌గా తిన‌డం, త‌ర‌చూ వ‌ర్షంలో తాడ‌వ‌టం, చ‌ర్మ సంర‌క్ష‌ణ లేక పోవ‌డం, మాయిశ్చ‌రైజ‌ర్లు యూజ్ చేయ‌క‌పోవ‌డం, చ‌ర్మంలో తేమ త‌గ్గి పోవ‌డం, వాట‌ర్ త‌క్కువ‌గా తీసుకోవ‌డం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల చ‌ర్మంపై ముడ‌త‌లు ఏర్ప‌డ‌తాయి.

దాంతో ఖ‌రీదైన క్రీములు, లోష‌న్లు కొనుగోలు చేసి.ముడ‌త‌ల‌ను పోగొట్టుకునేందుకు తెగ‌ ప్ర‌య‌త్నిస్తుంటారు.అయితే ఎలాంటి ఖ‌ర్చు లేకుండా న్యాచుర‌ల్‌గా కూడా ముడ‌త‌ల‌ను నివారించుకోవ‌చ్చు.అందుకు కొబ్బ‌రి నూనె అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

మ‌రి ఈ వ‌ర్షాకాలంలో కొబ్బ‌రి నూనెను ఎలా యూజ్ చేస్తే ముడ‌త‌లు పోతాయో ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల కొబ్బ‌రి నూనె, ఒక స్పూన్ అవ‌కాడో పేస్ట్ తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు అప్లై చేసి.కాసేపు సున్నితంగా మ‌సాజ్ చేసి.ప‌ది నిమిషాల పాటు డ్రై అవ్వ‌నివ్వాలి.అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో ముఖానికి క్లీన్ చేసుకోవాలి.

ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తే.ముడ‌త‌లు మ‌టు మాయం అవ్వ‌డంతో పాటు చ‌ర్మం స్మూత్‌గా, వైట్‌గా మారుతుంది.

అలాగే ఒక గిన్నె తీసుకుని అందులో రెండు స్పూన్ల కొబ్బ‌రి నూనె, ఒక స్పూన్ పెరుగు మ‌రియు అర స్పూన్ నిమ్మ ర‌సం వేసి క‌లిసేలా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మానికి ముఖానికి, మెడ‌కు పూసి.ఇర‌వై నిమిషాల అనంత‌రం వేళ్ల‌తో మెల్ల మెల్ల‌గా రుద్దుకుంటూ ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా ప్ర‌తి రోజు చేసినా ముడ‌త‌లు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.మ‌రియు చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube