కొబ్బరి బోండాల కట్టింగ్‌ ఉద్యోగం, జీతం పాతిక వేలు... ఆసక్తి ఉన్న వారు ఎవరైనా రావచ్చు  

Coconut Cutting Job Salary 25000 In Tamil Nadu-

ఎంత చదువుకున్నా ఈమద్య కాలంలో ఉద్యోగం అనేది కష్టం అవుతుంది.మంచి మార్కులతో పాస్‌ అయిన వారికి కూడా ప్రోత్సహం, రిఫరెన్స్‌ లేకపోవడం వల్ల జాబ్‌ రావడం లేదు.దేశంలో అంతకు అంతకు నిరుద్యోగం పెరిగి పోతున్న ఈ సమయంలో స్వయం ఉపాది పొందడం అనేది చాలా ముఖ్యం.

Coconut Cutting Job Salary 25000 In Tamil Nadu--Coconut Cutting Job Salary 25000 In Tamil Nadu-

ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ లేదా ప్రైవేట్‌ ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా వచ్చిన పని, నచ్చిన పని చేసుకుంటూ వెళ్లాలి.ఈమద్య మొహం మాటం వదిలేసి ఏ పని చేసినా కూడా వేలల్లో జీతాలు వస్తున్నాయి.

Coconut Cutting Job Salary 25000 In Tamil Nadu--Coconut Cutting Job Salary 25000 In Tamil Nadu-

కూలిపనికి వెళ్లిన వారికి కూడా రోజుకు అయిదు వందల నుండి వెయ్యి రూపాయల జీతం వస్తుంది.

తాజాగా తమిళనాడులో ఒక కొబ్బరి బోండాల వ్యాపారి తన కొట్టులో పని చేసేందుకు హెల్పర్స్‌ కావాలంటూ ఒక ప్రకటన ఇచ్చాడు.

బొబ్బరి బోండాల షాప్‌లో ఉద్యోగంకు ప్రకటన ఏంటా అని అంతా కూడా ఆశ్చర్యపోయారు.అయితే ఆ ఉద్యోగంకు అతడు 22 వేల నుండి 32 వేల రూపాయల జీతంను ఆఫర్‌ చేశాడు.అనుభవంను బట్టి జీతంను ఇస్తాను అంటూ ఆయన ప్రకటించడం తమిళనాడులో మాత్రమే కాకుండా సౌత్‌ ఇండియా మొత్తం వైరల్‌ అయ్యింది.

కొబ్బరి బోండాలు కొడుతూ వినియోగదారులకు ఇవ్వాలి.ప్రతి రోజు వందల కొబ్బరి కాయలు కొట్టాల్సి ఉంటుంది.అయినా కూడా అది చాలా పెద్ద మొత్తంలో సాలరీ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

బాగా చదువుకున్న వారికి కూడా 10 నుండి 20 వేల జీతం రావడం గగనం అయిన ఈ సమయంలో కొబ్బరి బోండాలు కొట్టే వ్యక్తికి పాతిక వేలకు ఎక్కువ జీతం అంటూ ప్రకటన రావడం ఆశ్చర్యంగా అనిపించింది.చాలా మంది ప్రకటన ఇచ్చిన వ్యక్తి వద్దకు వెళ్లారు.తమకు కొబ్బరి బోండాలు కొట్టడం రాదు, నేర్పిస్తే తప్పకుండా నేర్చుకుని జాబ్‌ చేస్తామంటూ చెప్పుకొచ్చారట.

కాని ఆ వ్యక్తి మాత్రం అనుభవం ఉన్న వారికి మాత్రమే తాను ఈ ఉద్యోగం ఇస్తానంటూ నిర్మొహమాటంగా చెప్పాడు.కొబ్బరి బోండాలు కొట్టేందుకు మనుషులు దొరకక పోవడం వల్ల ఆ వ్యాపారి ఇలాంటి ప్రకటన చేశాడట.

లక్షల్లో వ్యాపారం చేసే ఆ వ్యక్తికి కొబ్బరి బోండాలు కొట్టే వ్యక్తి చాలా అవసరం కనుక అంత పెద్ద మొత్తంలో సాలరీ ఆఫర్‌ చేసినట్లుగా తెలుస్తోంది.