గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ,అరటిపండ్లు ఎందుకు తీసుకువెళతామో తెలుసా ?

హిందూ సంప్రదాయం ప్రకారం అరటిపండ్లు,కొబ్బరికాయ గుడికి తీసుకువెళ్లి స్వామికి సమర్పిస్తాం.ఈ విధంగా సమర్పించటం వెనక ఒక కారణం ఉంది.

 Coconut And Banana Ritual At Temple , Coconut , Banana , Temple, Organic Produc-TeluguStop.com

హిందూ సంప్రదాయంలో ప్రతి ఆచారం వెనక ఒక మంచి కారణం దాగి ఉంటుంది.ఇప్పుడు ఆ కారణం ఏమిటో తెలుసుకుందాం.

కొబ్బరికాయ మరియు అరటి పళ్ళు ఈ రెండింటినీ “పవిత్రమైన సేంద్రీయ ఉత్పత్తులు” గా భావిస్తారు.ఈ రెండు ఉత్పత్తులు కలుషితమయ్యే అవకాశాలు లేవు.ఎటువంటి సందర్భంలో అయినా సరే మనం కొబ్బరికాయ విషయంలో, మీరు పైన ఉన్న గట్టి షెల్ ను వదిలేసి లోపలి కొబ్బరిని తిన్నందువలన మనకు చెడు జరగదు.మనం ఒక కొబ్బరి చెట్టును పెంచుకోవటం వలన మొత్తం కొబ్బరిచెట్టు వలన అనేక లాభాలు ఉన్నాయి.

అంతే కాకుండా కొబ్బరికాయ బాహ్య కవచం అహంకారం లేదా అహంగా భావిస్తారు.కాబట్టి దీనిని విచ్ఛిన్నం చేయవలసిన అవసరం ఉన్నది.

ఒక్క సారి మన మనస్సు నుండి అహంకారం తొలగితే ఆ మనస్సు కొబ్బరికాయ లోపల తెల్లని పదార్ధం వలె స్వచ్ఛంగా ఉంటుంది.కొబ్బరికాయలోని నీటిలో భావావేశం లేదా భక్తి ఉంటుంది.

కొబ్బరికాయ పైన మూడు కళ్ళను సత్వ, రజో మరియు తమో లేదా భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలను లేదా స్థూల, సూక్ష్మ మరియు కరణ శరీర లేదా శరీర మొదలైనవాటితో వివరణ ఇస్తారు.అలాగే మనం అరటిపండు లోపల భాగాన్ని తిని, దాని బయటి తొక్కని పడేయటం వలన మనకేమీ చెడు జరగదు.

అందుకే సేంద్రియ ఉత్పత్తులు అయిన కొబ్బరికాయ,అరటిపండు గుడికి తీసుకువెళ్లడంలో ఉన్న పరమార్ధం ఇదే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube