చెవిలోనే కాపురం పెట్టిన బొద్దింకలు  

Cockroaches Are Living Inside The Man\'s Ear-telugu Viral News Updates,viral In Social Media

చెవిలో బొద్దింకలు కాపురం పెట్టడం ఏంటి అని అనుకుంటున్నారా.వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది మాత్రం నిజం.ఇంటిలో కూడా కొద్దీ రోజులు ఎలాంటి శుభ్రం చేయకుండా ఉంటే ఎలా బొద్దింకలు పారాడుతూ ఉంటాయో,అలానే ఒంటిని కూడా శుభ్రంగా ఉంచుకోకపోతే బొద్దింకలు ఇలా చెవిలో కాపురం పెడతాయన్న విషయం ఈ తాజా ఉదంతం తో తెలిసింది.వివరాల్లోకి వెళితే….చైనా లోని గువాంగ్ ఢాంగ్ ప్రావిన్స్ హుయాంగ్ జిల్లా లో నివాసం ఉండే ఎల్ వీ(24) అనే వ్యక్తి నిద్రలో ఉండగా సెడన్ గా చెవుల్లో తీవ్రమైన నొప్పి మొదలైంది.అయితే అది బాగా ఎక్కువగా ఉండడం తో ఎదో ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటుంది అనుకోని ఆసుపత్రికి వెళ్ళాడు.

Cockroaches Are Living Inside The Man\'s Ear-telugu Viral News Updates,viral In Social Media-Cockroaches Are Living Inside The Man's Ear-Telugu Viral News Updates In Social Media

అయితే ఎదో మందులు ఇస్తారు నొప్పి తగ్గిపోతుంది అని భావించాడు.కానీ ఆసుపత్రిలో చూపించుకోవడానికే వెళ్లిన తరువాత పరీక్షించిన డాక్టర్లు అతడి చెవిలో బొద్దింకలు కాపురం పెట్టినట్లు డాక్టర్లు తెలుపగానే ఒక్కసారిగా ఖంగుతిన్నాడు.ఎల్‌వీ కుడి చెవిలో ఏకంగా కొన్ని బొద్దింక‌లు మకాం ఏర్పాటు చేసుకున్నాయి.

అలర్ట్ అయిన డాక్టర్లు వాటిని ట్వీజర్‌ సాయంతో తొలగించారు.ఒక పెద్ద బొద్దింక సహా, పది చిన్న బొద్దింకలను ఎల్‌వీ చెవి నుంచి తొలగించినట్లు అతనికి చికిత్స అందించిన వైద్యులు తెలిపారు.

అయినా మరి ఇంతలా చెవిలో బొద్దింకలు గూడు కట్టుకొనే వరకు కూడా అతగాడు తెలుసుకోలేకపోయారు.