అయ్య బాబోయ్… మహిళ చెవిలోకి వెళ్లిన బతికున్న బొద్దింక… చివరకు ?  

woman ear, cockroach, cockroach in woman ear, social media, viral - Telugu Cockroach, Cockroach In Woman Ear, Social Media, Viral, Woman Ear

2020 సంవత్సరం మొదలైనప్పటి నుండి మనం రోజుకి ఏదో ఒక వైపు నుండి ఏదో ఒక కొత్త సంఘటన వింటూనే ఉన్నాము.ఇదే తరహాలో తాజాగా ఓ మహిళ చెవిలోకి బతికున్న బొద్దింక వెళ్ళింది.

 Cockroach Woman Ear

ఈ సంఘటన కరోనా వైరస్ పుట్టినిల్లైన చైనా లోని గాంగ్ డాగ్ ప్రవెన్స్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది.సదరు మహిళకు చెవిలో ఓ రకమైన శబ్దం రావడంతో పాటు తీవ్రమైన నొప్పి వస్తుండడంతో దగ్గరలోని స్థానిక ఆసుపత్రికి వెళ్ళింది.

దీనిని బయటనుంచి పరీక్షించిన వైద్యులకు ఏమి అంతు చిక్కుక పోవడంతో ఓటోస్కోప్ ఉపయోగించి చూడగా చెవిలో కదలాడుతున్న బొద్దింక వైద్యులకు కనపడింది.దీంతో వైద్యులు ఒకింత షాక్ కు గురయ్యారు.

అయ్య బాబోయ్… మహిళ చెవిలోకి వెళ్లిన బతికున్న బొద్దింక… చివరకు -General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే డాక్టర్ నైపుణ్యంతో ఎలాంటి సర్జరీ అవసరం లేకుండానే అతి జాగ్రత్తగా ఆమె చెవిలో బతికి ఉన్న బొద్దింకను బయటకు తీశారు.

చెన్ అనే అమ్మాయి ఈ విషయాన్ని స్థానిక మీడియాకు తెలపడంతో అది కాస్త వైరల్ అయింది.

సరైన సమయంలో ఆమె ఆస్పత్రికి చేరుకోవడంతో పెను ముప్పు నుండి తప్పించుకుందని వైద్యులు తెలిపారు.ఒకవేళ ఆలస్యం అయ్యింటే మాత్రం ఆ అమ్మాయి కర్ణబేరి ద్వారా అది లోపలికి వెళ్ళి తీవ్ర నష్టం జరిగేదని వైద్యులు సూచించారు.

ఆమె నిద్రిస్తున్న సమయంలో చెవిలోకి బొద్దింక వెళ్లి ఉంటుందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఎవరికైనా ఇంట్లో బొద్దింకలు ఉంటే ఎలాంటి ఆలస్యం చేయకుండా క్రిమిసంహారక మందులు వాడి వాటిని చంపాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

#Viral #Cockroach #Social Media #Woman Ear

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Cockroach Woman Ear Related Telugu News,Photos/Pics,Images..