మోసం చేసిన పందెం కోడి : పండగ చేసుకున్న 'నకిలీ' రాయుళ్లు

సంక్రాతి పండుగ అంటే చాలు ఎక్కడెక్కడో కోళ్లు కత్తులు కట్టుకుని మరీ సై అంటే సై అంటూ… పోటీ పడుతుంటాయి.ఈ పండుగ మూడు రోజులు పందేలతో బిరులన్నీ కిటకిటలాడుతుంటాయి.

 Cockfight Punters Duped Fake Notes At Pongal Festival1-TeluguStop.com

దానికి తగ్గట్టుగానే కోట్లాది రూపాయలు చేతులు మారుతుంటాయి.ఇంతవరకు బాగానే ఉండగా… ఇప్పుడు పండుగా దాటి పదిహేను రోజులు వరకు అయ్యింది.

అయితే ఇప్పుడు పందేల్లో గెలిచిన వారి ముఖాల్లో ఆనందం ఆవిరి అయిపొయింది.ఎందుకు అంటే… దొంగ నోట్ల ముఠాలు పందెపు రా కోళ్ల పందెలు, జూద క్రీడల్లో నకిలీ నోట్లు కొంపముంచాయి.

కోడి పందేలు భారీ స్థాయిలో నిర్వహించే…కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలలో కోడి పందేలతో పాటు వివిధ జూదక్రీడలు భారీగా ఆడారు.కోళ్ల పందేల ముసుగులో జూదరాయుళ్లు చెలరేగిపోయారు.

భారీగా బెట్టింగ్‌లు కాశారు.పండుగ మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా 2వేల 500 కోట్ల రూపాయల వరకు బెట్టింగ్‌లు జరిగాయి.

పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారింది.పందెంలో గెల్చినవాళ్లు తమకు వచ్చిన డబ్బు చూసుకుని తెగ మురిసిపోయారు.అయితే కొన్ని రోజుల తర్వాత వారికి దిమ్మతిరిగిపోయే నిజం తెలిసింది.కోళ్ల పందేలలో తాము గెల్చిన నగదులో పెద్ద సంఖ్యలో దొంగ నోట్లు ఉన్నాయని తెలిసి ఆందోళన చెందుతున్నారు.

పందేల్లో తాము గెలిచినా… నకిలీ నోట్ల ముఠాలో మాత్రం దారుణంగా మోసపోయాం అంటూ ఇప్పుడు లబోదిబోమంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube