కండోమ్ ప్యాకెట్స్ లో కొకైన్! అడ్డంగా బుక్ అయిన స్మగ్లర్

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దేశాన్ని భయపెడుతున్నది డ్రగ్స్ మాఫియా అనే విషయం అందరికి తెలిసిందే.యువతని మత్తు మందుకి అలవాటు చేస్తున్న డ్రగ్స్ మాఫియాని, స్మగ్లింగ్ ని ఎంత నియంత్రించే ప్రయత్నం చేస్తున్న ఏదో ఒక మార్గంలో మాఫియా వాళ్ళు ఈ డ్రగ్స్ ని దేశాలలికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.

 Cocaine Smuggling With Condom Packets-TeluguStop.com

ముఖ్యంగా ఆఫ్రికా దేశాల నుంచి ఈ డ్రగ్స్ ఆసియా దేశాలలోకి వస్తుంది.ఇప్పటికే ఇలా ఇండియా, దుబాయ్ లాంటి దేశాలలో అక్రంగా డ్రగ్స్ స్మగ్లింగ్ చేసే వారిని చాలా సార్లు అరెస్ట్ చేసారు.

అయినా కూడా ఈ డ్రగ్స్ గ్యాంగ్ ఏవో కొత్త ఎత్తులు వేస్తూ డ్రగ్స్ తరలించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.

ఆ మధ్య వేరుశనగలలో డ్రగ్స్ ని తరలించే ప్రయత్నం చేసి దుబాయ్ లో అడ్డంగా ఓ వ్యక్తి బుక్ అయ్యాడు.

ఇప్పుడు దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో ఓ వ్యక్తి కండోమ్ ప్యాకేట్స్ లో డ్రగ్స్ తరలించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయాడు.పెరు దేశానికి చెందిన ఓ స్మగ్లర్ పెరు నుంచి ఈజిప్ట్‌కు కొకైన్‌ను కండోమ్ ప్యాకెట్లలో తరలించడానికి యత్నించి దుబాయ్ పోలీసులకు దొరికిపోయాడు.

దుబాయ్ ఎయిర్‌పోర్టులో స్మగ్లర్ బ్యాగును కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా బ్యాగు నిండా కండోమ్ ప్యాకెట్లు దొరికాయి.ఆ ప్యాకెట్లను ల్యాబ్‌కు పంపగా, 2.3 కేజీల కొకైన్‌ను అందులో దొరికింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube