కోకాకోలా కూల్ ‌డ్రింక్స్‌ ఇక నుండి ప్లాస్టిక్ బాటిళ్లల్లో రావట.. !

కోకాకోలా కంపెనీ తన కూల్‌డ్రింక్స్‌ విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకుందట.ఇప్పటి వరకు కూల్ డ్రింక్స్ ‌ను బాటిళ్లల్లో అందిస్తున్న ఈ కంపెనీ ఇకనుండి ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగించమని వెల్లడిస్తుంది.

 Coca Cola Cooldrinks Are Not Come In Plastic Bottles Only Used In Paper Bottles,-TeluguStop.com

ఇకపోతే ప్లాస్టిక్ వ్యర్థాలపై ‘బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ ప్లాస్టిక్’ అనే స్వచ్ఛంద సంస్థ చేసిన అధ్యయనంలో ప్లాస్టిక్ వ్యర్థాలకు ఎక్కువగా కారణమవుతున్న సంస్థల్లో కోకాకోలా కంపెనీ మొదటి స్థానం దక్కించుకుందట.అందుకే కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్లాస్టిక్ బాటిళ్ల స్థానంలో పేపర్ బాటిల్స్‌ను తీసుకు వస్తున్నామని కోకాకోలా సంస్థ ప్రకటించింది.

ఇందుకు గాను పొబొకో అనే మరో సంస్థతో ఒప్పందం చేసుకుందట.కాగా కోకాకోలా కంపెనీ ప్యాకేజింగ్ ఇన్నోవేషన్ మేనేజర్ స్టిజన్ ఫ్రాన్సెన్ దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.

రీసైక్లింగ్ చేయగలిగే పేపర్ లేదా ఇతర పదార్థాలతో బాటిళ్లను రూపొందించేందుకు తమ సంస్థ ప్రయత్నాలు మొదలుపెట్టిందని వెల్లడించారు.

ఇక ప్రపంచంలో అత్యధికంగా ప్లాస్టిక్ వ్యర్థాలకు కారణమవుతున్న సంస్థగా కోకాకోలాకు ఉన్న పేరును చెరిపేసుకుంటుందన్న మాట ఈ సంస్ద.

ఇలాగే మిగతా కంపెనీల వారు కూడా ఆలోచిస్తే పర్యావరణానికి మేలు చేసినవారు అవుతారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube