ఇంట్లోనే నివాసం ఉంటున్న కోబ్రా.. చూసి షాకైన కుటుంబం!

సాధారణంగా పాములను చూసి మనలో చాలా మంది భయపడుతుంటారు.కానీ వాటికి అపాయం కలిగిస్తారేమోననే భయంతోనే అవి మనల్ని కాటు వేస్తాయని అంతే తప్ప పాములకు మానవుల మీద ఎటువంటి ద్వేషం లేదని శాస్త్రవేత్తలు చెబుతూనే ఉంటారు.

 Cobra Living In The House   Shocked Family!, Cobra, In House, 27 Cobras , Odisha-TeluguStop.com

కానీ ఎంతలా శాస్త్రవేత్తలు చెప్పినా.మనలో ఎవరికైనా పాము కనిపిస్తే.

తప్పనిసరిగా చంపేందుకు ప్రయత్నిస్తాం.లేదా అటవీ అధికారులకు సమాచారం అందించి ఆ పామును బంధిస్తాం.

అనంతరం దగ్గర్లోని అడవిలో కాని జూలో కానీ వదిలేస్తాం.ఇలా మనకు ఒక్క పాము కనిపిస్తేనే హడలిపోతుంటాం.

కానీ ఒక ఇంట్లో దాదాపు 27 పాములు ఒకేసారి దర్శనం ఇచ్చాయి.

ఒడిషా లోని కలహండి జిల్లాలో ఉన్న ఓ గ్రామంలో నాగుపాము ఏకంగా ఒకరి ఇంట్లోనే ఆవాసం ఏర్పరుచుకుని 26 పిల్లలకు జన్మనించ్చింది.

ఆ పాము గుడ్లు పెట్టి పొదిగి పిల్లలు చేసినప్పటికీ ఆ ఇంట్లో వారెవరికీ కనిపించకపోవడం గమనార్హం.ఆ కుటుంబ సభ్యులకు ఆ నాగుపాము ఎటువంటి అపకారం కూడా చేయలేదు.

కానీ ఇలా ఉండగా.ఒకరోజు ఆ పాము ఇంట్లో నివసిస్తున్న వారికి కనిపించడంతో వారంతా భయకంపితులయ్యారు.

Telugu Cobras, Berendrakumar, Cobra, Forest Offecer, Kala Handi, Odisha, Shocked

ఏం చేయాలో తెలియక అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.వారి ఫిర్యాదు మేరకు అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బంది ఆ పామును పాము పిల్లలను బంధించారు.ఇలా ఏకంగా 26 పిల్లలు ఉండడం చూసి అటవీ శాఖ అధికారులే నివ్వెరపోయారు.ఇలా బంధించిన పాము, పాము పిల్లలను సమీపంలోని అడవిలో వదిలేసినట్లు కలహండి అటవీ శాఖ అధికారి బీరేంద్ర కుమార్ సాహు తెలిపారు.

ఎన్నో రోజులుగా ఇంట్లో ఉండి 26 పిల్లలకు జన్మనిచ్చినా కూడా ఆ పాము ఇంట్లో ఉంటున్న ఎవరికి కూడా హాని తలపెట్టలేదని అటవీ అధికారులు తెలిపారు.అటవీ జంతువులకు ఎవరు కూడా హాని తలపెట్టొద్దని సూచించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube