కొండ చిలువ‌తో నాగుపాము భీక‌ర పోరు.. చివ‌ర‌కు గెలిచిందెవ‌రంటే..

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన చాలా వీడియోలు వైరల్ అవతుండటం మనం చూడొచ్చు.క్రూర జంతువులతో పాటు సరీసృపాలు ఇతరాలు పోట్లాడుకున్న వీడియోలు తొందరగా వైరల్ అవుతుంటాయి.

 Cobra Fierce Fight With The Python If He Wins To The End ,  Python, Viral Video,-TeluguStop.com

ప్రస్తుతం ఈ కోవకు చెందిన వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది.సదరు వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయిన నిమిషాల్లో లక్షల్లో వ్యూస్ లభించడంతో పాటు బాగా వైరల్ అవుతుండటం గమనార్హం.

ఈ వీడియోలో నాగుపాము, కొండ చిలువ మధ్య భీకర పోరు జరుగుతోంది.జనరల్‌గా నాగుపాముకు ఎక్కువ శక్తి ఉంటుందా? లేదా కొండ చిలువకు ఎక్కువ శక్తి ఉంటుందా? అని ఎవరిని అడిగినా వారు చెప్పే సమధానం కొండ చిలువనే.

కానీ, ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోలో కొండ చిలువ కంటే కూడా నాగుపాము శక్తిమంతమైనది కావడం గమనార్హం.వైరల్‌ ప్రెస్‌ అనే యూట్యూబర్ తన యూట్యూబ్‌ అకౌంట్‌లో షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట బాగా వైరలవుతోంది.

పాముల జాతిలో కొండ చిలువ అతి పెద్దది మాత్రమే కాదు శక్తిమంతమైనది కూడా.కానీ, ఈ వైరల్ వీడియోలో కొండ చిలువ నాగు పాము ముందు చిన్నదైపోయింది.

ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియోలో నాగుపాము కొండ చిలువను చంపి మింగేసింది.వీడియో చూస్తున్నంత సేపు మీకు భయం కూడా అవుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

అయితే, వీడియో మొదట్లో నాగుపామును కొండ చిలువ మింగేసిందేమోనని మీరు అనుకోవచ్చు.కానీ, వీడియోను క్షుణ్ణంగా పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది.నాగుపామే కొండ చిలువను చంపేసి ఆ తర్వాత మింగేస్తుందని.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

ఈ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.నాగుపాము చాలా శక్తిమంతమైనది కాబట్టే కొండ చిలువను మింగేసిందని వీడియో చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తంగా భయంకరమైన వీడియోను చూసేశామని మరికొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

Cobras fierce battle with the hill crosses.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube