కర్నాటకలో రాజకీయ సంక్షోభం! బీజేపీకి మద్దతుగా 14 మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు!

కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్, జేడీఎస్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో వున్నా సంగతి అందరికి తెలిసిందే.అతి తక్కువ మెజార్టీతో ప్రభుత్వాన్ని నడుపుతున్న కుమారస్వామి టీం నుంచి కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకి చెందిన 14 మది ఎమ్మెల్యే లు సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతుని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటన చేసి ఒక్కసారిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తుంది.

 Coalition Government Face Political Crisis In Karnataka-TeluguStop.com

ఎన్నికల సమయంలో క్యాంపు రాజకీయాలు చేసి, ఎమ్మెల్యేలని కాపాడుకునే ప్రయత్నం చేసిన కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల నుంచి ఇప్పుడు ఉన్నపళంగా ఎమ్మెల్యేలు జారుకొని వెళ్ళిపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం సంక్షోభంలో పడే అవకాశం వున్నట్లు కనిపిస్తుంది.

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో మూడు వర్గాలుగా విడిపోయిన ఎమ్మెల్యే లో కొంత మంది సంకీర్ణ సర్కార్ కి మద్దతు ఉపసంహరించుకొని బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.

కాంగ్రెస్, జేడీఎస్ అధినాయకత్వం ఎమ్మెల్యేని సంప్రదించే ప్రయత్నం చేస్తున్న కూడా వారు అందుబాటులోకి రాకపోవడంతో కర్ణాటకలో సంకీర్ణ సర్కార్ కూలిపోయే అవకాశం వుందని టాక్ రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube