సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ ప్రకటన

సింగరేణిలో పనిచేస్తున్న బొగ్గుగని కార్మికులకు యాజమాన్యం దీపావళి కానుకను ప్రకటించింది.ప్రతి ఏటా సింగరేణి కార్మికులకు అందించే దీపావళి బోనస్‌కు సంబంధించి యాజామాన్యం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది.ఏ ఏడాది దీపావళి కానుకగా ప్రతి కార్మికుడికి రూ.64,700 చొప్పున దీపావళి బోనస్‌ను యాజమాన్యం అందజేయనుంది.

Telugu India, Diwali Bonus, Singareni-

జాతీయ బొగ్గుగని కార్మికుల వేతన ఒప్పందం(ఎన్సీడబ్ల్యూఏ) ప్రకారం 2018-19 ఆర్ధిక సంవత్సరంలో కార్మికుల పనితీరును బట్టి పర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డు పథకం పేరుతో ఈ బోనస్‌ను అందజేయనున్నారు.గతేడాది బొగ్గుగని కార్మికులకు రూ.60,500 చొప్పున చెల్లించగా ఈ సారి అది రూ.64,700గు నిర్ణియించారు.ఈ దీపావళి బోనస్ మొత్తాన్ని ఈ నెల 25న సింగరేణి కార్మికుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు యాజమాన్యం తెలిపింది.

దీపావళి బోనస్ పండుగ సమయంలో తమకు అందుతుండటంతో సింగరేణి కార్మికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

తమ కృషిని యాజమాన్యం గుర్తించడంలో సఫలమవుతున్నందుకు తాము సంతోషం వ్యక్తం చేస్తున్నామని పలువురు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube