కోచ్ కాదు కామాంధుడు..!

Coach Is Not A Lover, Coach, Nagarajan, National Athlete

కోచ్ కాదు కామాంధుడు.! శిష్యురాలు గా భావించి శిక్షణ ఇవ్వాల్సిన కోచ్ లే  లైంగిక వేధింపులకు గురి చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

 Coach Is Not A Lover, Coach, Nagarajan, National Athlete-TeluguStop.com

మేలో అథ్లెటిక్ కోచ్ గా ఉన్న తమిళనాడుకు చెందిన నాగరాజన్ పై ఓ 19 ఏళ్ల జాతీయ అథ్లెట్ లైంగిక వేధింపులు పాల్పడుతున్నడంటూ ఫిర్యాదు చేసింది.ఆ తర్వాత మరో ఏడుగురు అథ్లెట్లు కూడా ఇదే రకమైన ఆరోపణలు చేశారు.

ఫిర్యాదు చేసిన వారిలో కొంతమంది రిటైర్మెంట్ తీసుకున్న అథ్లెట్లు కూడా ఉన్నారు.మూడేళ్లుగా నాగరాజన్ కింద శిక్షణ తీసుకున్న క్రీడాకారిణులు జాతీయస్థాయి పోటీల్లో పతకాలు కూడా సాధించారు.

దీంతో అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

గత నెలలోనే పోలీసులు నాగరాజన్ పై చార్జిషీట్ సైతం నమోదు చేశారు.

కోచింగ్ పేరుతో కొంతమందిని వేరుచేసి మసాజ్ పేరుతో తాకరాని చోట తాకి పైశాచికత్వాన్ని ప్రదర్శించే వాడే వారు ఆవేదన వ్యక్తం చేశారు.జాతీయస్థాయిలో జూనియర్ విభాగంలో రికార్డు నెలకొల్పిన ఓ అథ్లెట్ తన బాధను చెప్పుకొచ్చింది.

కోచ్ అంటేనే భయం వేసేది అని వెల్లడించింది.చెప్పినట్టు చేయకపోతే క్యారెక్టర్ మంచిది కాదు అంటూ అథ్లెట్లు పై చెడు ప్రచారం చేసే వాడిని వివరించింది.

కెరీర్ ను నాశనం చేస్తాడని భయపడి చాలామంది ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదని తెలుస్తోంది.ఒళ్ళో కూర్చోబెట్టుకుని స్టైచింగ్ చేయిన్చేవాడిని చెబుతున్నారు.

ఇలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని అథ్లెట్లు కోరుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube