గత ఏడాది అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి చిన్న చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కేరాఫ్ కంచరపాలెం సినిమా సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ రిలీజ్ చేయడానికి ముందుకి రావడంతో అందరి ద్రుష్టిని ఆకర్షించింది.రానా ఈ చిత్రంకు నిర్మాతగా వ్యవహరించడంతో పాటు గట్టిగా ప్రమోషన్ చేయడంతో సినిమా జనాల్లోకి విపరీతంగా వెళ్ళిపోయింది.
పెళ్లి చూపులు తర్వాత ఆ స్థాయిలో థియేటర్స్ లో ఈ సినిమా ఆడియన్స్ ని ఆకట్టుకుంది.కమర్షియల్ గా సక్సెస్ కాకున్న ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాని తమిళం, మలయాళీ భాషాలలో రీమేక్ చేయడానికి రంగం సిద్ధం అయ్యింది.టాలీవుడ్ ప్రముఖ నిర్మాత రాజశేఖర్ రెడ్డి మీడియా సమావేశంలో ఈ సినిమా రీమేక్ గురించి స్పష్టం చేసారు.
సురేష్ బాబు గారి వద్దకు వెళ్లి రీమేక్ రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసానని ప్రస్తుతం తమిళ రీమేక్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయ్యిందని, మరో వైపు మలయాళం రీమేక్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని చెప్పుకొచ్చాడు.తమిళ, మలయాళీ భాషలలో ఈ సినిమా ప్రముఖ నటులతో తెరకెక్కిస్తా అని నిర్మాత చెప్పుకొచ్చారు.