టార్గెట్ ట్రంప్..సీఎన్ఎన్ ప్రశ్నల వర్షం..!!   CNN Targets Donald Trump     2018-11-11   08:04:12  IST  Surya

రెండు రోజుల క్రితం మధ్యంతర ఎన్నికల్లో ఘోరంగా ఫరాభావం ఎదుర్కున్న ట్రంప్ ఆ తరువాత వైట్ హౌస్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు..ఆ సమయంలో అమెరికా ఎన్నికల్లో రష్యా కల్పించుకున్న విషయాల గురించి ప్రశ్నలు సంధిస్తున్న క్రమంలో ట్రంప్ సీఎన్ఎన్ విలేఖరిపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు ఇక్కడి నుంచీ నువ్వు వెళ్ళిపో అంటూ ఫైర్ అయ్యారు.అంతేకాదు అతడి వైట్ హౌస్ పాస్ కూడా రద్దు చేశారు..అసలే మీడియా అందులోనూ అంతర్జాతీయ మీడియా

ఊరికే ఊరుకుంటుందా ట్రంప్ ఎక్కడ దొరుకుతాడా అని చూస్తున్న తరుణంలో, అంతర్జాతీయ నేతల సమావేశానికి ట్రంప్‌ బయల్దేరుతున్న ట్రంప్ అడ్డంగా దొరికాడు.. అబ్బి ఫిలిప్‌ అనే మహిళావిలేకరి ట్రంప్‌తో మాట్లాడుతూ ” 2016 ఎన్నికల సందర్భంగా రష్యాతో కుమ్మకై ప్రచారం చేశారనే ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తులో మీకు అనుకూలంగా ఉండేందుకే అటార్నీ జనరల్‌ను మార్చారా..?” అని ప్రశ్నించారు.

CNN Targets Donald Trump-

దాంతో ఒక్క సారిగా మళ్ళీ ఆ విలేఖరిపై విరుచుకు పడ్డాడు..నువ్వు ఎన్నో సార్లు బుర్రతక్కువ ప్రశ్నలు అడిగావు అంటూ ఎద్దేవా చేశాడు ట్రంప్..నేను చాలా సార్లు నిన్ను చూశాను. నువ్వు చాలా బుర్రతక్కువ ప్రశ్నలు అడుగుతావు” అని ఆ విలేకరి వైపు వేలు చూపుతూ వ్యాఖ్యానించాడు..దాంతో సీఎన్ఎన్ ట్రంప్ ని టార్గెట్ చేసినట్టుగా అందరికి అర్థమయ్యిపోయింది.