కరోనా రోగులతో కార్యక్రమాలు చేశాడు,చివరికి  

Cnn Prime Anchor Chris Cuomo Corona Positive - Telugu Chris Cuomo, Cnn, Cnn Prime Anchor Chris Cuomo, Corona Patients, Coronavirus, Interview

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం విదితమే.సామాన్యులు,సెలబ్రిటీలు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరిపై కూడా ఈ కరోనా ప్రభావం చూపుతూనే ఉంది.

 Cnn Prime Anchor Chris Cuomo Corona Positive

ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 43 వేల కు పైగా నమోదు కాగా, ప్రపంచ వ్యాప్తంగా 8 లక్షలకు పైగా కరోనా బాధితులు ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నారు.ప్రపంచ దేశాలు ఈ మహమ్మారి ని కట్టడి చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఈ వైరస్ వల్ల మృతి చెందే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి.

ప్రముఖ టీవీ ఛానెల్ యాంకర్ కూడా ఈ కరోనా మహమ్మారి బారిన పడినట్లు తెలుస్తుంది.
ప్రపంచ ప్రసిద్ధ చానెల్ సీఎన్ఎన్ ప్రైమ్ టైమ్ న్యూస్ యాంకర్‌గా ప‌ని చేస్తున్న‌ క్రిస్ క్యూమో.

కరోనా రోగులతో కార్యక్రమాలు చేశాడు,చివరికి-General-Telugu-Telugu Tollywood Photo Image

గత కొద్ది రోజులుగా కరోనా రోగులతో ప‌లు కార్యక్రమాలు చేశారు.ఈ నేప‌థ్యంలో అత‌నికి క‌రోనా సోకింది.ఈ విష‌యాన్ని క్రిస్ త‌న అధికారిక ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు.మార్చి 31న 9pm ప్రోగ్రామ్ లో క్రిస్ క్యూమో పాల్గొనాల్సి ఉండగా.

ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డ‌డంతో ఆసుప‌త్రిలో చేరారు.ప్ర‌స్తుతం అత‌ని ఆరోగ్య ప‌రిస్థితి బాగానే ఉన్న‌ట్టు తెలుస్తుంది.

డ్ర‌గ‌న్ కంట్రీ చైనాలోని వుహ‌న్‌లో పుట్టిన కోవిడ్‌-19 ప్ర‌పంచాన్ని చుట్టేస్తోంది.దాదాపు 200 దేశాల చేరువ‌గ ఎగ‌బాకిన వైర‌స్ కార‌ణంగా అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకుల వ‌ణికిపోతోంది.

అమెరికాలో వైరస్ విలయ తాండవం చేస్తోంది.మంగళవారం 9 pm ప్రోగ్రామ్‌లో క్రిస్ క్యూమో పాల్గొనాల్సి ఉండగా ఇంతలో ఈ విషయం బయటపడడం తో ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తుంది.

గత కొద్ది రోజులుగా ఆయన కరోనా రోగులతో కార్యక్రమాలు చేస్తుండగా తాజాగా ఆయన ఈ వైరస్ బారిన పడటం చర్చనీయాంశంగా మారింది.కాగా, న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమోకు ఇతడు సోదరుడు అని సమాచారం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Cnn Prime Anchor Chris Cuomo Corona Positive Related Telugu News,Photos/Pics,Images..