వార్నింగులు వర్కౌట్ అవుతున్నాయా జగన్ ?  

cm ys jagan warning to minister for local body elections -

నాకు కథలు చెప్పవద్దు, ఫలితాల్లో ఏమైనా తేడా వస్తే వారు, వీరు అని కూడా ఆలోచించను.ఫలితాలకు పూర్తి బాధ్యత మంత్రులు, ఇంచార్జి మంత్రులే వహించాలి.

 Cm Ys Jagan Warning To Minister For Local Body Elections

ఎక్కడైనా అలక్ష్యం వహించినా, ప్రతిపక్ష పార్టీ పైచేయి సాధించినా మీరు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలి అంటూ ఏపీ సీఎం జగన్ తన క్యాబినెట్ మంత్రుల కు సీరియస్ గా వార్నింగ్ లు ఇప్పటికే ఇచ్చేశారు.వీరితో పాటు మంత్రులు, నియోజకవర్గాల ఇన్చార్జిలు, ఎమ్యెల్యేలకు ఇదే తరహాలో వార్నింగ్ వెళ్ళాయి.

దీంతో వీరంతా బాగా అలెర్ట్ అయ్యారు.ఎక్కడా గ్రూపు తగాదాలు లేకుండా, అందరిని సమన్వయపరుస్తూ పార్టీ విజయం పై కసరత్తు మొదలుపెట్టారు.

వార్నింగులు వర్కౌట్ అవుతున్నాయా జగన్ -Political-Telugu Tollywood Photo Image

ఇక జగన్ మంత్రులతో తరచుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా ప్రతి మంత్రి పనితీరుకి సంబంధించిన నివేదిక తన వద్ద ఉందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో విఫలమైన వారిని తప్పించేందుకు తాను ఏమాత్రం వెనుకడుగు వేయనని గట్టిగానే చెప్పేస్తున్నారు.

ఆ హెచ్చరికల నేపథ్యంలో వైసిపి నాయకులు అంతా క్షేత్రస్థాయిలో నాయకుల పనితీరు, పార్టీ పరిస్థితులపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు.నియోజకవర్గాల్లో ఉన్న చిన్నా, చితక నాయకులకు కూడా ఫోను చేసి పార్టీ అభ్యర్థులు ఎవరైనా గెలుపు సహకరించాలని కోరుతున్నారు.

అదే సమయంలో ఇప్పటి వరకు ప్రభుత్వం అమలు చేసిన అన్ని పథకాల గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంతో పాటు, భవిష్యత్తులో ఇంకా ఎటువంటి పథకాలు రాబోతున్నాయి అనే విషయాలపైనా వారికి అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలను జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఎందుకంటే ఈ ఫలితాల ఆధారంగానే ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉంది అనేది తేలుతుంది.అంతేకాకుండా ఒకవేళ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఈ పోరులో ఎక్కువ స్థానాలు సాధిస్తే, వైసీపీ ప్రభుత్వం పరువు పోవడమే కాకుండా, తెలుగుదేశం బలం పుంజుకునే అవకాశం ఏర్పడుతుందని, జగన్ ఇంతగా వీటిపై దృష్టి పెట్టి అందరికీ గట్టిగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ఏది ఏమైనా, జగన్ హెచ్చరికలు గట్టిగానే పనిచేస్తున్నట్లు క్షేత్రస్థాయిలో వైసీపీ నాయకుల హడావుడి చూస్తేనే అర్థమవుతోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Cm Ys Jagan Warning To Minister For Local Body Elections Related Telugu News,Photos/Pics,Images..