సీఎం అయితే ఏంటి.. కోర్టుకు రావాల్సిందే..!  

Supreem Court Serious Warning To Cm Ys Jagan Mohan Reddy-cm Ys Jagan Mohan Reddy,సీఎం అయితే ఏంటి

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి మరోసారి దిమ్మదిరిగే షాకిచ్చింది సీబీఐ కోర్టు.వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఆ మధ్య జగన్‌ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలుసు కదా.

Supreem Court Serious Warning To Cm Ys Jagan Mohan Reddy-cm Ys Jagan Mohan Reddy,సీఎం అయితే ఏంటి Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage-Supreem Court Serious Warning To CM YS Jagan Mohan Reddy-Cm Ys Reddy సీఎం అయితే ఏంటి

అయితే ఈ పిటిషన్‌ను కోర్టు అప్పుడే కొట్టేసింది.కచ్చితంగా కోర్టుకు రావాల్సిందేనని తేల్చి చెప్పింది.

ఇది జరిగి చాలా రోజులే అవుతున్నా.ఆ తర్వాత కూడా జగన్‌ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కాలేదు.

ముఖ్యమంత్రి కావడంతో చాలా బిజీగా ఉంటానని, వ్యక్తిగతంగా హాజరు కావడం కుదరదు అని తన లాయర్లకు చెప్పి పంపిస్తున్నారు.ఆ తీర్పు వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా జగన్‌ నేరుగా కోర్టుకు వెళ్లలేదు.

శుక్రవారం కూడా మరోసారి జగన్‌ కేసు విచారణకు వచ్చింది.ఈసారి కూడా ఆయన హాజరు కాకపోవడంతో కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

నేరానికి, హోదాకు సంబంధం లేదని సీబీఐ కోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది.ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సిందే అని మరోసారి స్పష్టం చేసింది.

వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న జగన్‌ తరఫున లాయర్ల వాదనను తోసిపుచ్చింది.

వచ్చే వారం.అంటే జనవరి 10న కచ్చితంగా రావాల్సిందేనని స్పష్టం చేసింది.అక్రమాస్తుల కేసులో జగన్‌ ఏ1 కాగా.విజయసాయి రెడ్డి ఏ2గా ఉన్న విషయం తెలిసిందే.దీంతో జగన్‌తోపాటు ఏ2 విజయసాయి కూడా కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే అని కోర్టు తేల్చి చెప్పింది.

.

తాజా వార్తలు

Supreem Court Serious Warning To Cm Ys Jagan Mohan Reddy-cm Ys Jagan Mohan Reddy,సీఎం అయితే ఏంటి Related....