ఆ కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు అంటున్న జగన్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండు రోజుల పాటు ఢిల్లీ పర్యటనలో పలువురు కీలక కేంద్రమంత్రులను కలవడం జరిగింది.వీరిలో పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో కూడా జగన్ భేటీ కావడం జరిగింది.

 Cm Ys Jagan Meets Central Minister Dharmendra-TeluguStop.com

ఈ సందర్భంగా కాకినాడ ప్రాంతంలో పెట్రోల్ కాంప్లెక్స్ అదేవిధంగా విశాఖ స్టీల్ పై ప్రైవేటీకరణ దానికి ప్రత్యామ్నాయం వంటి విషయాల గురించి చర్చించడం జరిగింది.

చర్చలో భాగంగా కాకినాడ లో పెట్రోల్ కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సానుకూలంగా స్పందించారని, అదేరీతిలో వ‌య‌బిలిటి గ్యాప్ ఫండ్ విష‌యంలో రాష్ట్రం పై ఎటువంటి భారం పడకుండా చూడాలని చెప్పిన దానికి కూడా కేంద్ర మంత్రి నుండి సానుకూల స్పందన వచ్చినట్లు తెలిపారు.దీనిపై వచ్చేవారం ఏపీ చీఫ్ సెక్రటరీ తోపాటు పెట్రోలియం శాఖ కార్యదర్శులతో కేంద్రమంత్రి సమావేశం కానున్నట్లు స్పష్టం చేశారు.సమావేశాల అనంతరం వ‌య‌బిలిటి గ్యాప్ ఫండ్ విష‌యంలో విధివిధానాలు ఖరారు చేసే అవకాశం ఉందని సీఎంఓ ఆంధ్రప్రదేశ్ వర్గాలు సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది

 Cm Ys Jagan Meets Central Minister Dharmendra-ఆ కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు అంటున్న జగన్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com
#YS Jagan #Dharmendra

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు