అమరావతి పై జ'గన్' గురి ! బాబు బుక్కవుతాడా ?

ఏపీ రాజధాని అమరావతి పై మొదటి నుంచి ఏదో ఒక రకమైన వార్త చెలరేగుతూనే ఉంది.జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి అమరావతి మీద అనేక ప్రచారాలు జరిగాయి.

 Cm Ys Jagan Look On Ap Sachivalayam-TeluguStop.com

రాజధాని అమరావతిలో కాకుండా ప్రకాశం జిల్లా దొనకొండలో ఏర్పాటు చేసేందుకు జగన్ ప్లాన్ చేస్తున్నాడంటూ ప్రచారాలు జరిగాయి.ఇప్పటికే కోట్లాది రూపాయలు అమరావతి లో ఖర్చుపెట్టామని ఒక వేళ రాజధాని ప్రాంతాన్ని వేరే ప్రదేశానికి మారిస్తే కనుక ఆ సొమ్మంతా వృధా అవుతుందని తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా లో అనేక కథనాలు ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి.

ఈ నేపథ్యంలో రాజధాని భూముల విషయం, అమరావతి కథ తేల్చేందుకు జగన్ సిద్ధం అయ్యాడు.

-Telugu Political News

దీనిలో భాగంగానే రెండు రోజుల్లో అమరావతి సంగతి తేల్చేందుకు సమావేశం కూడా జగన్ ఏర్పాటు చేయబోతున్నారు.అసలు రైతుల దగ్గర నుంచి ఎంతెంత భూములు సేకరించారు ? వారికి ఏ విధమైన పరిహారం ఎంతెంత ఇచ్చారు అనే విషయాల గురించి జగన్ ఆరా తీయబోతున్నాడట.సింగపూర్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలు, రాజధాని ప్రాంతంలో చేసిన పనులపై సమీక్ష నిర్వహించబోతున్నారు.

రాజధాని చుట్టూ వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగి ఉంటుందంటూ ఇప్పటికే చాలామంది అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.స్వయంగా జగన్ కూడా ఈ అంశంపై గతం నుంచి అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వాటికి సంబందించిన అన్ని వివరాలను జగన్ తెప్పిస్తున్నాడు.

-Telugu Political News

అమరావతి బాండ్లు ప్రవేశపెట్టి సేకరించిన నిధుల్ని ఏం చేశారనే కోణంలో కూడా జగన్ ఆరా తీయబోతున్నారు.ఈ అన్ని అంశాలపై తాను పెట్టబోయిమీటింగ్ కి సిద్ధంగా ఉండాలంటూ ఇప్పటికే సీఆర్డీఏ అధికారులకు సమాచారం అందింది.రాజధాని అంశంపై పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించిన తర్వాత.7వ తేదీన జరగనున్న వైసీపీఎల్పీ సమావేశంలో దీనిపై చర్చిస్తారట.అమరావతి విషయంలో జగన్ దూకుడు చూస్తుంటే గత టీడీపీ ప్రభుత్వంలో జారీ చేసిన అన్నిరకాల జీవోల మీద, అవినీతి ఆరోపణలు ఎదుర్కున్న అనేక అంశాల మీద జగన్ పూర్తి స్థాయిలో ద్రుష్టి పెట్టబోతున్నాడు జగన్.ఇదే దూకుడుతో కనుక జగన్ ముందుకు వెళ్తే టీడీపీ ప్రభుత్వం లో మంత్రులుగా పనిచేసిన వారితో పాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబు కూడా ఇరుక్కునే ప్రమాదం కూడా లేకపోలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube