ఎయిడ్స్‌ వ్యాదితో యాంకర్‌ రవి మృతి... సోషల్‌ మీడియాలో వైరల్‌, కారణం ఇదే  

Cm Ys Jagan Fans Counter To Anchor Ravi-andhra People Voting,patas Show,pawan Kalyan,ys Jagan Fans,ysrcp Fans,సోషల్‌ మీడియాలో వైరల్‌

యాంకర్‌ రవి గురించి తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రవి ఎన్నో కార్యక్రమాలకు యాంకర్‌గా వ్యవహరించడంతో పాటు, స్టేజ్‌ కార్యక్రమాలకు కూడా యాంకరింగ్‌ చేస్తూ ఉంటాడు. ఆడియో వేడుకలు అవార్డు ఫంక్షన్స్‌ అంటూ రకరకాల కార్యక్రమాలతో ఎప్పటికప్పుడు మీడియా ముందు ఉండే యాంకర్‌ రవి అదే విధంగా వివాదాస్పదం కూడా అవుతూ ఉన్నాడు..

ఎయిడ్స్‌ వ్యాదితో యాంకర్‌ రవి మృతి... సోషల్‌ మీడియాలో వైరల్‌, కారణం ఇదే-CM Ys Jagan Fans Counter To Anchor Ravi

పటాస్‌ కార్యక్రమంతో బాగా ఫేమస్‌ అయిన యాంకర్‌ రవి తాజాగా ఆ పటాస్‌ కార్యక్రమం వల్ల పెద్ద ఎత్తున విమర్శల పాలు అయ్యాడు.

తాజాగా పటాస్‌ షోలో ఒక కమెడియన్‌ కామెడీ చేస్తూ… ఏపీ జనాలకు ఓట్లు వేయడం రాదు, సరైన నాయకులను ఎన్నుకోవడం రాదు అంటూ డైలాగ్‌ చెప్పాడు. అందుకు రవి గట్టిగా నవ్వుతూ ఆ వ్యాఖ్యలను సమర్ధించడం జరిగింది. యాంకర్‌ రవి ఇండైరెక్ట్‌గా ఏపీలో జగన్‌ సీఎం అవ్వడం మంచిది కాదు, ఏపీ ప్రజలు జగన్‌ను సీఎంగా ఎన్నుకుని తప్పు చేశారు, పవన్‌ వంటి వ్యక్తిని కాదనుకుని పెద్ద తప్పు చేశారు అంటూ ఇష్టం వచ్చినట్లుగా ఎవరికి వారు ఊహించుకుని మాట్లాడేసుకోవడం జరుగుతుంది.

రవిపై వైకాపా అభిమానులు పెద్ద ఎత్తున సోషల్‌ మీడియాలో దాడి చేస్తున్నారు.

బయట రవి కనిపిస్తే బౌతిక దాడికి కూడా సిద్దం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో కొందరు సోషల్‌ మీడియాలో యాంకర్‌ రవి ఎయిడ్స్‌ వ్యాదితో మృతి చెందాడు, ఎంతో మంది వెంట పడ్డ అతడు ఎయిడ్స్‌ వ్యాది వల్ల మృతి చెందడం విచారకరం అంటూ కొందరు సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. తనపై వస్తున్న విమర్శలకు యాంకర్‌ రవి క్షమాపణ చెప్పాడు.

తన ప్రమేయం లేకున్నా, తాను అనకున్నా కూడా క్షమాపనలు చెప్పిన రవి తనకు జగన్‌ అంటే అభిమానం, త్వరలోనే ఆయన్ను కలువబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. అయినా కూడా వైకాపా అభిమానులు మాత్రం రవిని వదలడం లేదు.