సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్( CM ys jagan )ను కలిసిన ఏషియన్ గేమ్స్‌లో పతకాలు సాధించిన ఏపీ క్రీడాకారులు కోనేరు హంపి, బి.అనూష, యర్రాజీ జ్యోతిఅంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న ఏపీ క్రీడాకారులను అభినందించిన సీఎం వైఎస్ జగన్ జాతీయ, అంతర్జాతీయ క్రీడలలో పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, క్రీడలకు మరింతగా ప్రాధాన్యతనిస్తున్నామన్న సీఎం వైఎస్ జగన్‌ఇటీవల చైనాలోని హాంగ్జౌ( Hangzhou ) నగరంలో జరిగిన 19 వ ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన కోనేరు హంపి, బి.
అనూష, యర్రాజీ జ్యోతి, తాము సాధించిన పతకాలను సీఎం వైఎస్ జగన్‌కు చూపిన క్రీడాకారులు.
స్పోర్ట్స్ పాలసీ ప్రకారం క్రీడాకారులకు ఇచ్చే నగదు పురస్కారాన్ని విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
1.మైనేని సాకేత్ సాయి, విశాఖపట్నం, టెన్నిస్, ఏషియన్ గేమ్స్ సిల్వర్ మెడల్ విజేత, ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన నగదు బహుమతి రూ.20 లక్షలు.2.వెన్నం జ్యోతి సురేఖ, ఎన్టీఆర్ జిల్లా, ఆర్చరీ, ఏషియన్ గేమ్స్‌లో 3 గోల్డ్ మెడల్స్ విజేత, ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన నగదు బహుమతి రూ.90 లక్షలు.3.కిడాంబి శ్రీకాంత్, గుంటూరు, బాడ్మింటన్, ఏషియన్ గేమ్స్‌లో సిల్వర్ మెడల్ విజేత, ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన నగదు బహుమతి రూ.20 లక్షలు.4.ఆర్.సాత్విక్ సాయిరాజ్, రాజమహేంద్రవరం, బాడ్మింటన్, ఏషియన్ గేమ్స్‌లో సిల్వర్, గోల్డ్ మెడల్ విజేత, ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన నగదు బహుమతి రూ.50 లక్షలు.5.యర్రాజీ జ్యోతి, విశాఖపట్నం, అథ్లెటిక్స్, ఏషియన్ గేమ్స్‌లో సిల్వర్ మెడల్ విజేత, ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన నగదు బహుమతి రూ.20 లక్షలు.6.బొమ్మదేవర ధీరజ్, ఆర్చరీ, ఏషియన్ గేమ్స్‌లో సిల్వర్ మెడల్ విజేత, ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన నగదు బహుమతి రూ.20 లక్షలు.7.కోనేరు హంపి, ఎన్టీఆర్ జిల్లా, చెస్, ఏషియన్ గేమ్స్‌లో సిల్వర్ మెడల్ విజేత, ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన నగదు బహుమతి రూ.20 లక్షలు.8.బి.అనూష, అనంతపూర్, క్రికెట్, ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ విజేత, ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన నగదు బహుమతి రూ.30 లక్షలు.
ఈ నగదు పురస్కారంతో పాటు గతంలో పతకాలు సాధించినందుకు ఇచ్చే ప్రోత్సాహక బకాయిలు మొత్తం కలిపి రూ.4.29 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం.ఇటీవల జరిగిన ఏషియన్ గేమ్స్( Asian Games )లో ఏపీ క్రీడాకారులు మొత్తం 11 పతకాలు (5 గోల్డ్, 6 సిల్వర్) సాధించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసులు, క్రీడాశాఖ మంత్రి ఆర్‌కే రోజా, శాప్ ఎండీ హెచ్.
ఎం.ధ్యానచంద్ర, శాప్ అధికారి రామకృష్ణ.