కుప్పం నియోజకవర్గం పార్టీ కార్యకర్తలతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ భేటీ

కుప్పం నా సొంత నియోజకవర్గంతో సమానం భరత్‌ను గెలిపిస్తే.మంత్రి పదవిచంద్రబాబు హయాంలో కన్నా.ఈ మూడేళ్లలో కుప్పంకు అత్యధికంగా మేలు జరిగింది కుప్పం మున్సిపాల్టీకి సంబంధించి రూ.65 కోట్ల విలువైన పనులను మంజూరు చేస్తున్నాం కుప్పం అభివృద్ధికి అన్ని వేళలా అండగా ఉంటాను 175 కి 175 సీట్లు గెలిచే పరిస్థితి కుప్పం నుంచే మొదలు కావాలి: సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.కుప్పం నియోజకవర్గ కార్యకర్తలతో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సమావేశం.ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే.

 Cm Shri Ys Jagan Met With Party Workers Of Kuppam Constituency Ys Jagan , Kuppam Constituency , Ap Poltics , Chandra Bbua Naidu , Tdp, Amaravathi , Bharath ,-TeluguStop.com

కార్యకర్తలతో సమావేశాన్ని కుప్పంనుంచే ప్రారంభిస్తున్నాం: సీఎం కుప్పం అంటే టీడీపీకి ఒక కంచుకోట అని, ఎప్పటినుంచో చంద్రబాబుగారికి మద్దతుగానే ఉందని అని బయట ప్రపంచం అంతా అనుకుంటారు వాస్తవం ఏంటంటే.బీసీలు ఎక్కువగా ఉన్న స్థానం కుప్పం నియోజకవర్గం బీసీలకు మంచి చేస్తున్నాం అంటే .అది ప్రతి పనిలోనూ కనిపించాలి బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన మంచి వ్యక్తి, ఐఏఎస్‌ అధికారి చంద్రమౌళిని అభ్యర్థిగా పెట్టి మనం అడుగులు ముందుకేశాం దురదృష్టవశాత్తూ చంద్రమౌళి మనకు దూరమయ్యారు అంతటితో ఆ కుటుంబాన్ని వదిలేయకుండా.ఆయన కుమారుడు భరత్‌ను తీసుకు వచ్చాం చంద్రమౌళి చికిత్స పొందుతున్న సమయంలో నేను ఆస్పత్రికి కూడా వెళ్లాను ఆరోజు భరత్‌ నాకు పరిచయం అయ్యాడు నేను భరత్‌ను ప్రోత్సహిస్తానని ఆరోజే చెప్పాను.

ముందుండి ప్రతి అడుగులోనూ సపోర్ట్‌ చేశాం మీరు కూడా భరత్‌పై అదే ఆప్యాయతను చూపించారు దీనివల్ల భరత్‌ నిలదొక్కుకున్నాడు: భరత్‌ను ఇదేస్థానంలో నిలబెడతారా? లేదా ఇదే భరత్‌ను మళ్లీ పై స్థానంలోకి తీసుకు వెళ్తారా? అన్నది మీమీద ఆధారపడి ఉంది: భరత్‌ను గెలుపించుకు రండి :భరత్‌ను మంత్రిగా మీ కుప్పానికి ఇస్తాను: నియోజకవర్గంలో చంద్రబాబు గెలుస్తారు, ఆయన సీఎం అవుతాడు, కుప్పం అభివృద్ధి చెందుతుంది అనే ఒక భ్రమను టీడీపీ, చంద్రబాబు కల్పించుకుంటా వెళ్లారు నిజం చెప్పాలంటే.చంద్రబాబు హయాంలో కన్నా.

ఈమూడేళ్లలో కుప్పం నియోజకవర్గానికి ఎక్కువ మేలు జరిగింది స్కూళ్లలో నాడు –నేడు, ఇళ్లపట్టాలు, ఆస్పత్రుల్లో నాడు–నేడు, ఇక ప్రతి గ్రామంలోనూ సచివాలయం, విలేజ్‌ క్లినిక్, ఆర్బీకే.ఇవన్నీకూడా గతంలో ఏ గ్రామంలోనూ కనిపించలేదు మన కళ్ల ఎదుటే ఇవి కనిపిస్తున్నాయి.

నాడు – నేడుతో బడులన్నీకూడా రూపురేఖలు మారుతున్నాయి ఫ్యామిలీ డాక్టర్‌కాన్సెప్ట్‌కూడా అమల్లోకి వస్తుంది: సీఎంగా చంద్రబాబు చేసిన అభివృద్ధికన్నా.ఇప్పుడు ఎక్కువ అభివృద్ధి జరుగుతోంది రాబోయే రోజుల్లో మరింత జరుగుతుంది: వచ్చే రెండురోజుల్లో కుప్పం మున్సిపాల్టీకి సంబంధించి రూ.65 కోట్ల విలువైన పనులను మంజూరు చేస్తున్నాం భరత్‌ అడిగాడు, జగన్‌గా నేను చేయిస్తున్నాను కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పని జరుగుతూ ఉంది సంవత్సరంలోపు దాన్ని పూర్తిచేస్తాం కుప్పం నియోజకవర్గాన్ని నా నియోజకవర్గంగానే చూస్తాను అన్నిరకాలుగా మద్దతు ఇస్తాను గతంలో కుప్పం గెలుస్తామా? అంటే ప్రశ్నార్థకంగా ఉన్న పరిస్థితుల్లో ఎప్పుడూ జరగని అద్భుతాలు జరిగాయి పంచాయతీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికల్లో ఘనవిజయాలు నమోదుచేశాం:ఇవాళ ఇంత మంచిచేస్తున్న ప్రభుత్వానికి ఆశీర్వదిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది గడపగడపకూ కార్యక్రమంఇవాళ జరుగుతోంది పథకాలన్నీ అందాయా? అని అడుగుతున్నాం అందాయని ప్రజలు చెప్తున్నారు రాజకీయాల్లో మనం ఉన్నందుకు సంతోషం కలుగుతుంది: రాజకీయనాయకుడిగా మనకు ఉత్సాహం ఎప్పుడు వస్తుందంటే.ప్రజలు ఆశీర్వదిస్తున్నప్పుడు, వారు మనల్ని దీవిస్తున్నప్పుడు వస్తుంది: ఇవాళ కాలర్‌ ఎగరేసుకుని… మనం గర్వంగా ప్రజల్లోకి వెళ్తున్నాం ఈ ఆశీస్సులు ఇస్తున్న ప్రజల మద్దతు తీసుకునే బాధ్యత మీది: 175కి 175 సీట్లు గెలిచే వాతావరణం కుప్పంనుంచే ప్రారంభం కావాలి మీ భుజస్కంధాలమీద ఈ బాధ్యతను పెడుతున్నాను మీ మీద ఆ నమ్మకం నాకు ఉంది రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి కార్యకర్తలకు అన్నిరకాలుగా తోడుగా నిలుస్తాం సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.

Disclaimer : TeluguStop.com Editorial Team not involved in creation of this article & holds no responsibility for its content.This story is published using press releases provider feed.


తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube