సీఎం రేవంత్ రెడ్డి ఫేక్ న్యూస్ పెడ్లర్..: కేటీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ( Revanth Reddy )ట్విట్టర్ ఎక్స్ వేదికగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( BRS Working President KTR ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

సీఎం రేవంత్ రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.

తన బంధువుకు రూ.వెయ్యి కోట్ల కొవిడ్ డ్రగ్ కాంట్రాక్ట్ వచ్చిందని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సచివాలయంలో నిజాం ఆభరణాలను తాను తవ్వించినట్లు నకిలీ కథనాన్ని సృష్టించారని తెలిపారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా( Home Minister Amit Shah ) ఫేక్ వీడియోను సర్క్యులేట్ చేయించారన్న కేటీఆర్ సీఎం హోదాలోనే ఓయూ ఫేక్ సర్క్యులర్ పోస్ట్ చేశారని విమర్శించారు.

ఇలాంటి ఫేక్ న్యూస్ పెడ్లర్ అయిన రేవంత్ రెడ్డిని ఎందుకు జైల్లో పెట్టకూడదని ప్రశ్నించారు.

Advertisement
హే ప్రభూ.. ఏంటి ఈ విడ్డురం.. బస్సు అనుకుంటే పొరపాటే సుమీ..

తాజా వార్తలు