CM Revanth Reddy : కాంగ్రెస్ పార్టీకి అండగా ఖమ్మం జిల్లా..: సీఎం రేవంత్ రెడ్డి

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అన్నారు.

జిల్లాలోని మణుగూరులో కాంగ్రెస్ నిర్వహించిన ‘ప్రజాదీవెన సభ’ లో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు అయ్యారన్న ఆయన ఒక రాజ్యసభ సీటుు ఇచ్చామని పేర్కొన్నారు.ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్( Congress ) అద్భుత విజయాలు సాధించిందని తెలిపారు.

కార్యకర్తలు రక్తాన్ని చెమటగా మార్చి కాంగ్రెస్ ను గెలిపించారని చెప్పారు.

ఖమ్మం జిల్లా( Khammam ) పోరాటం, ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని తెలిపారు.గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం( BRS Govt ) దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్లు హామీతో మోసం చేసిందన్నారు.గత మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఖమ్మం జిల్లా ప్రజలు గెలవనివ్వలేదని చెప్పారు.

Advertisement

కేసీఆర్ ను ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు నమ్మలేదని తెలిపారు.

బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!
Advertisement

తాజా వార్తలు