నీటిపారుదల శాఖ సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..!!

రాష్ట్రంలో ఆయా ప్రాజెక్టుల వివరాలను గ్రామాలు, మండలాల స్థాయిలో సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఆదేశించారు.శనివారం నీటిపారుదల శాఖపై( Irrigation Department ) సమీక్ష సమావేశం నిర్వహించారు.

 Cm Revanth Key Comments In The Irrigation Department Review Meeting Details, Cm-TeluguStop.com

ఈ క్రమంలో పెండింగ్ ప్రాజెక్టులను ప్రాధాన్యతా ప్రాతిపదికన పూర్తి చేసేందుకు ఓ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.ఇదే సమయంలో నారాయణపేట్‌-కొడంగల్‌ లిఫ్ట్ ఇరిగేషన్, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.

కొన్ని ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాల్సి ఉందన్నారు.ఇదే సమయంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు( Palamuru-Rangareddy Project ) ప్రస్తుత పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు.

కల్వకుర్తి ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ఎందుకు ముందుకు సాగడం లేదని అధికారులను ప్రశ్నించారు.మొదటి ప్రాధాన్యతగా ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు.ఏదిఏమైన టన్నెల్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది.ఎస్‌ఎల్‌బిసి ప్రాజెక్టు( SLBC PROJECT ) పూర్తయితే 4లక్షల హెక్టార్ల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని వివరించారు.

ఈ క్రమంలో గ్రీన్‌ ఛానల్‌ ద్వారా కొన్ని ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.శనివారం నీటిపారుదల శాఖ సమీక్ష సమావేశంలో పలు ప్రాజెక్టుల ఆయకట్టు వివరాలను సీఎం రేవంత్‌ రెడ్డి అడిగి తెలుసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube