సీఎం ర‌మేష్‌.. అలా చేయ‌గ‌ల‌డా?!

ఏపీలో ఇప్పుడు స‌వాళ్లు.ప్ర‌తి స‌వాళ్ల‌.

 Cm Ramesh Hunger Strike Over Kadapa Steel Plant-TeluguStop.com

రాజ‌కీయాలు సాగుతున్నాయి.అధికార టీడీపీ, విప‌క్షం వైసీపీలు.

ఒక‌రిపై ఒక‌రు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌ల‌తోపాటు.స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు కూడా రువ్వుకుంటున్నారు.

ఇక‌, నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంపై వైసీపీ ఎంపీలు చేసిన రాజీనామాల విష‌యంలో రాజ‌కీయాలు చేసిన టీడీపీకి.ఇప్పుడు ఆ రాజీనామాలు ఆమోదం పొంద‌డంతో ఏం చేయాలో తెలియ‌డం లేదు.

ఏపీకి ప్ర‌త్యేక హోదా వ‌స్తే.విభ‌జ‌న ద్వారా న‌ష్ట‌పోయిన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంద‌నేది.

వైసీపీ ఎంపీల వాద‌న‌.ఇది నిజ‌మేన‌ని కూడా విశ్లేష‌కులు చెప్పుకొచ్చారు.

ఏపీకి ప్రత్యేక హోదా కావాలని, అదొక్కటే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, నిరుద్యోగ యువత భవితకు బాటలు వేస్తుందని గట్టిగా విశ్వసించాడు జ‌గ‌న్‌.ఈ నేప‌థ్యంలోనే తాను స్వయంగా అమరణ నిరాహారదీక్ష చేయడంతో పాటు ఉద్యమంలో వాడి వేడీ ఏ మాత్రం చల్లార కుండా ఎప్పటికప్పుడు అనేక పోరాటాలు సాగిస్తూ వచ్చారు.ఏపీకి ప్రత్యేక హోదా వస్తే పలు రకాల రాయితీలు వస్తాయని… రాయితీలొస్తే వేలల్లో పరిశ్రమలొస్తాయని….పరిశ్రమలొస్తే లక్షల్లో ఉద్యోగాలు వస్తాయని జగన్‌ ప్రజల్లో చైతన్యం రగిలించారు.ప్రత్యేక హోదా పోరులో అగ్రభాగాన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ దూసుకు పోతూండటంతో అప్పటి దాకా ‘ప్రత్యేక హోదాతో ఏమొస్తుంది?’ అని సన్నాయి నొక్కులు నొక్కిన ముఖ్యమంత్రి ఒక్కసారిగా ప్రత్యేక హోదా కావాలని డిమాండ్‌ చేస్తూ ‘యూటర్న్‌’ తీసుకున్నారు.

హోదా కావాలంటూ తాము నిర్ణయించిన ప్రజా ఎజెండాను చంద్రబాబు కూడా అనుసరించక తప్పని పరిస్థితులను జగన్‌ కల్పించారు.

ఇక‌, వైసీపీ ఎంపీల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు స‌వాళ్లు రువ్వే.టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేష్‌.ఇప్పుడు క‌డ‌ప ఉక్కు ఫ్యాక్ట‌రీ విష‌యంపై ఆమ‌ర‌ణ దీక్ష చేప‌డుతున్నారు.విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న విధంగా దీనిని ఏపీకి కేటాయించాల‌ని ఆయ‌న ప‌ట్టుబ‌డుతున్నారు.

అయితే, దీనిని ఇచ్చేందుకు కేంద్రం తాత్సారం చేస్తోంద‌ని, తాము ప‌ట్టుబ‌ట్టి సాధించి.ఏపీని అగ్ర‌గామి రాష్ట్రంగా నిల‌బెడ‌తామ‌ని కూడా ర‌మేష్ ప‌లుమార్లు ప్ర‌క‌టించారు.

అయితే, ఒక‌వేళ కేంద్రం క‌డ‌ప‌కు ఉక్కు ప‌రిశ్ర‌మ ఇచ్చేందుకు ముందుకు రాక‌పోతే.వైసీపీ ఎంపీల మాదిరిగా త‌న ప‌ద‌వికి త్యాగం చేసేందుకు ర‌మేష్ సిద్ధ‌మేనా? అనే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌స్తోంది.వైసీపీ ఎంపీలు ప్ర‌జా క్షేత్రం గెలుపొంది కూడా.అదే ప్ర‌జ‌ల కోసం ఏడాది స‌మ‌యం ఉండ‌గానే త‌మ ప‌ద‌వులు త్య‌జించి ప్ర‌త్యేక హోదా కోసం పోరుకు మ‌రింత‌గా రెడీ అయ్యారు.

మ‌రి ఈ త‌ర‌హా సాహ‌సం ర‌మేష్ చేయ‌గ‌ల‌డా? ఆయ‌న త‌న ప‌ద‌విని.క‌డ‌ప ఉక్కు కోసం త్యాగం చేయ‌గ‌ల‌డా? అనే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న మ‌వుతున్నాయి.మ‌రి దీనికి ఆయ‌నే స‌మాధానం చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube