సీఎం రమేష్ కంప్లైంట్ ఎఫెక్ట్‌… ఆ బీజేపీ నేత‌కు స్ట్రాంగ్‌ వార్నింగ్‌…!  

cm ramesh compliant effect.. strong warning to that bjp candidate,CM Ramesh, Chandrababu Naidu, BJP, Ap, GVL, YS Jagan, Anil Kumar, Purushotham Roopa, - Telugu Anil Kumar, Ap, Bjp, Chandrababu Naidu, Cm Ramesh, Cm Ramesh Compliant Effect.. Strong Warning To That Bjp Candidate, Gvl, Purushotham Roopa, Ys Jagan

ఏపీ బీజేపీలో రోజు రోజుకు లుక‌లుక‌లు, గ్రూపు త‌గాదాలు పెరిగి పోతున్నాయి.పార్టీ బ‌లోపేతం కాక‌పోయినా గ్రూపుల‌కు మాత్రం కొద‌వ‌లేద‌న్నట్టుగా ఉంది.

TeluguStop.com - Cm Ramesh Compliant Effect Strong Warning To That Bjp Candidate

చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్ప‌టి నుంచే ఏపీ బీజేపీలో కొంద‌రు బాబుకు అనుకూలంగా ఉంటే, మ‌రి కొంద‌రు జ‌గ‌న్‌కు అనుకూలంగా ఉంటూ వ‌స్తున్నారు.ఇక్క‌డ జ‌గ‌న్ సీఎం అయ్యి.

చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్నా కూడా ఇప్పుడు కూడా కొంద‌రు బాబుకు, మ‌రి కొంద‌రు జ‌గ‌న్‌కు అనుకూలంగా ఉంటున్నారు.పైగా జ‌గ‌న్ సీఎం అయ్యాక బీజేపీలో గ్రూపులు పెరిగిపోయాయి.

TeluguStop.com - సీఎం రమేష్ కంప్లైంట్ ఎఫెక్ట్‌… ఆ బీజేపీ నేత‌కు స్ట్రాంగ్‌ వార్నింగ్‌…-Political-Telugu Tollywood Photo Image

తాజాగా బీజేపీ ఎంపీ జీవీఎల్‌.న‌ర‌సింహారావుకు ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ.న‌డ్డా క్లాస్ పీకిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.అయితే బీజేపీకే చెందిన మ‌రో రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం రమేష్ జీవీఎల్‌పై చేసిన ఫిర్యాదుతోనే ఆయ‌న‌కు చీవాట్లు ప‌డిన‌ట్టు తెలుస్తోంది.

ఏపీలో ఇటీవ‌ల భారీ వ‌ర్షాల‌కు పంట‌లు ఘోరంగా దెబ్బ‌తిని రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోయారు.ఈ క్ర‌మంలోనే వైసీపీ నేత‌లు, కేంద్ర వ్య‌వ‌సాయ శాఖా మంత్రి పురుషోత్తం రూపాల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించాల‌నుకున్నార‌ట‌.

అయితే ఈ మీటింగ్‌ను జీవీఎల్ క‌నుస‌న్న‌ల్లో నిర్వ‌హించాల‌ని చూడ‌డంతో పాటు ఆయ‌న కూడా వైసీపీ నేత‌ల‌తో క‌లిసే స‌మ‌వేశానికి రెడీ అయ్యార‌ట‌.అయితే ఈ స‌మావేశంపై మిగిలిన బీజేపీ ఎంపీల‌కు జీవీఎల్ క‌నీస స‌మాచారం కూడా ఇవ్వ‌లేద‌ట‌.

ఈ విష‌యం తెలిసిన సీఎం రమేష్ నేరుగా జేపీ న‌డ్డాకు ఫిర్యాదు చేయ‌డంతో న‌డ్డా జీవీఎల్‌కు స్ట్రాంగ్ క్లాస్ పీకార‌ట‌.రమేష్‌తో పాటు మిగిలిన ఎంపీలు కూడా జీవీఎల్ తీరుపై అసంతృప్తి వ్య‌క్తం చేశార‌ట‌.

ఇక జీవీఎల్‌, వైఎస్.జ‌గ‌న్ బావ అనిల్‌కు ద‌గ్గ‌ర బంధువే అవుతార‌ని.

వారిద్ద‌రి మ‌ధ్య సంబంధాలు స్ట్రాంగ్‌గా ఉన్నాయని.అందుకే జీవీఎల్ వైసీపీ నాయ‌కుల చెప్పు చేత‌ల్లో ఉంటున్నార‌ని.

బీజేపీలోని కొంద‌రు తీవ్ర అస‌హ‌నంతో ఉన్నారు.ఈ క్ర‌మంలోనే ఆయ‌న వైసీపీకి చాలా ఫేవ‌ర్‌గా ఉండ‌డంతోనే నడ్డాకు ఫిర్యాదులు వెళ్ల‌డంతో చివ‌ర‌కు ఆయ‌న గ‌ట్టిగా క్లాస్ పీక‌క త‌ప్ప‌లేదంటున్నారు.

#YS Jagan #Anil Kumar #CM Ramesh #CmRamesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Cm Ramesh Compliant Effect Strong Warning To That Bjp Candidate Related Telugu News,Photos/Pics,Images..