ప్రధాని మోడీ తో భేటీ కానున్న సీఎం మమతా బెనర్జీ..!!

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు నుండి బీజేపీ వర్సెస్ మమతాబెనర్జీ అన్నట్టు రాజకీయ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.ఎన్నికల ప్రచారంలో బిజెపి మమతా బెనర్జీని గట్టిగా టార్గెట్ చేయగా ఆమె కూడా బిజెపికి దీటుగా ఎత్తుగడలు వేసి అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించి మరోసారి సీఎం అయ్యారు.

 Cm Mamata Banerjee To Meet Pm Modi-TeluguStop.com

అయినా కానీ బిజెపి పెద్దలతో నువ్వానేనా అన్నట్టుగా మమతా బెనర్జీ వ్యవహరిస్తూ తాను పోటీ చేసిన నియోజకవర్గంలో ఓటమిపై పలు విషయాలపై గట్టిగా వారిపై అనేక ఆరోపణలు చేయడం జరిగింది.

పరిస్థితి ఇలా ఉండగా ‘పెగాసస్’ స్పైవేర్” వ్యవహారం.పార్లమెంటు, రాజ్యసభలో కేంద్రంపై విపక్షాలు మండిపడుతున్న సంగతి తెలిసిందే.ఇటువంటి తరుణంలో ఈనెల 28వ తారీకు ప్రధాని మోడీతో చర్చించడానికి మమతా బెనర్జీ రెడీ అయ్యారు.

 Cm Mamata Banerjee To Meet Pm Modi-ప్రధాని మోడీ తో భేటీ కానున్న సీఎం మమతా బెనర్జీ..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ విషయాన్ని స్వయంగా ఆమె ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో తెలియజేశారు.‘పెగాసస్’ స్పైవేర్ వ్యవహారం సభలను కుదిపేస్తున్న సమయంలో.మోడీతో మమతా బెనర్జీతో భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.ఇదిలా ఉంటే ఇది అధికారిక పర్యటన అని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి.

#Mamata Banerjee #Modi #PachimaBengal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు