కేసీఆర్ టార్గెట్ తో అంతర్మధనంలో బీజేపీ.. ఇక రూటు మార్చనుందా?

తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్న పరిస్థితి ఉంది.వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం.

 Cm Kcr Warns Bjp President Bandi Sanjay, Cm Kcr, Telangana, Bjp President Bandi-TeluguStop.com

అయితే కేసీఆర్ రెండు రోజులు నిర్వహించిన ప్రెస్ మీట్ లో లేవనెత్తిన అంశాల పట్ల బీజేపీ నుండి ఆశించిన సమాధానం రాలేదు.దీంతో తెలంగాణ రైతాంగం ఒక్కసారిగా బీజేపఎ వైపు కన్నెర్ర చేసే పరిస్థితి ఏర్పడింది.

ఎందుకంటే ఒక సారిగా వరి వేసి ఉంటే పరిస్థితి ఇంకా దయనీయ పరిస్థితి ఎదురయ్యేదని, బీజేపీ పార్టీ తమ రాజకీయ వ్యూహంలో భాగంగానే రైతులను రెచ్చగొట్టిందనే విషయాన్ని ప్రజలు గమనించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

అయితే కేసీఆర్ రెండు రోజులు గంట ప్రెస్ మీట్ తోనే బీజేపీ సమాధానం చెప్పలేక పోయిన పరిస్థితుల్లో బీజేపీ ముఖ్య నాయకులు అంతర్మథనంలో పడ్డారు.

ఇప్పటి వరకు బీజేపీ తమ ప్రచారాయుధాలుగా   వాడిన దళిత ముఖ్యమంత్రి, ఇంకా మందు తాగుతారని బీజేపీ చేస్తున్న అన్ని ప్రచారాలకు ముఖ్యమంత్రి  కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు.దీంతో ఇక తప్పక బీజేపీ రూటు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

లేకపోతే కేసీఆర్ మాటల తూటాలకు బీజేపీ ప్రజల దృష్టిలో శాశ్వతంగా దోషిగా నిలిచిపోయే పరిస్థితి ఉంది.అందుకే బీజేపీ ఇక నుండి ఆచి తూచి మాట్లాడాలని అంతర్గతంగా చర్చ జరిగిందని ప్రచారం జరుగుతోంది.

  కాని ఇప్పటి వరకు బండి సంజయ్ కేసీఆర్ కామెంట్స్ కు సమాధానం ఇవ్వలేని పరిస్థితి ఉంది.ఒకవేళ ఈరోజు కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహిస్తే బీజేపీని శాశ్వతంగా ఇరుకునపెట్టే వ్యాఖ్యలు విమర్శలు చేసే అవకాశం ఉంది.

మరి బండి సంజయ్ స్పందిస్తారా లేక మౌనం వహిస్తారా అన్నది చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube