సీఎం కేసీఆర్‎కు కొత్త రేషన్ కార్డుల చిక్కులు..?

తెలంగాణలో కొత్త రేషన్​ కార్డుల కోసం లక్షల మంది అర్హులు ఎదురు చూస్తున్నారు.కొంతమందికి వివాహాలు కావడం, కుటుంబాలు వేరు పడటంతో సెపరేట్ కార్డుల కోసం వెయిట్​చేస్తుండగా, మరికొంత మంది అసలు కార్డులే లేక సర్కార్​ ఎప్పుడు ఇస్తుందా అని నిరీక్షిస్తున్నారు.

 Cm Kcr Troubling With The Issue Of Granting New Ration Cards To People Details,-TeluguStop.com

రేషన్​కార్డులను ఇష్టారీతిన తొలగించడంపై కొన్ని రోజుల కింద సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.దాదాపు 22 లక్షల కార్డులు ఎలా తొలగించారని నిలదీసింది.

రద్దు చేసిన కార్డులను తిరిగి పరిశీలించాలని ఆదేశించింది.ఈ నేపథ్యంలో లబ్దిదారులు తమకు అప్లికేషన్ ​పెట్టుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 2.87 కోట్ల మందికి 90 లక్షల 49వేల 480 రేషన్​కార్డులున్నాయి.అయితే అసలు రేషన్​కార్డు లేని కుటుంబాలు కొంత వరకే ఉండగా.కుటుంబాలు వేరుగా మారి రేషన్​కార్డులు విడిగా ఉండాలని కోరుకుంటున్న వారి సంఖ్యే ఎక్కువగానే ఉంటోంది.వీరంతా తహసీల్దార్ ​ఆఫీసులు, డిస్ర్టిక్ట్​ సివిల్​సప్లయ్​ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు.అలాగే రేషన్​కార్డుల్లో పిల్లల పేర్లను కూడా నమోదు చేయించుకునేందుకు అవకాశం లేకుండా పోయిందని మరికొందరు అంటున్నారు.

గతంలో రేషన్​కార్డుల జారీ నిరంతరంగా కొనసాగేది.ఇప్పుడు మాత్రం ప్రభుత్వం అనుకున్నప్పుడే అప్లికేషన్లు తీసుకుంటోంది.

Telugu Cm Kcr, Cards, Shops, Supreme, Telangana, Trs-Political

ఎవరైనా కొత్తగా ఆప్లై చేసుకుందామని వెళ్తే వారికి నిరాశే మిగులుతోంది.2018 లో ముందస్తు ఎన్నికలు రావడంతో 1.65 లక్షల కార్డులు ఇచ్చారు.కరోనా నేపథ్యంలో పోయిన ఏడాది కొత్త కార్డులు మంజూరు చేసినా, అందులో పెండింగ్​లో ఉన్న అప్లికేషన్లనే అప్రూవ్​ చేశారు.2019లో దాదాపు 7లక్షలకు పైగా అప్లికేషన్లు వస్తే.3.09 లక్షల కార్డులకే అప్రూవల్​ ఇచ్చారు.అంతకు ముందు 2020 సంవత్సరంలో అయితే కేవలం పదుల సంఖ్యలో కార్డులు ఇచ్చారు.

దీంతో ఇంకా 6 నుంచి 8 లక్షల మంది కొత్త కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు.

Telugu Cm Kcr, Cards, Shops, Supreme, Telangana, Trs-Political

మరోవైపు రాష్ట్రంలో 90.50 లక్షల కార్డులు ఉంటే రేషన్ షాపులు మాత్రం 17వేల012 ఉన్నాయని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి.మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు 800 కార్డులకు, ఇతర కార్పొరేషన్లలో 800 నుంచి 1000 కార్డులకు ఒక రేషన్ షాపు ఉండాలి.

ఇక జీహెచ్ఎంసీ ఏరియాలో 1000 నుంచి 1200 కార్డులకు ఒక రేషన్​ షాపును అందుబాటులో ఉంచాలి.కానీ, చాలా ప్రాంతాల్లో దీనికి అనుగుణంగా దుకాణాలు లేవు.దీంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు.500 కార్డులకు ఒక రేషన్ షాపు నిబంధనను సవరిస్తే రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా నాలుగు వేల షాపులు ఏర్పాటయ్యే అవకాశం ఉంటుంది.ఇక రాష్ట్రంలోని దాదాపు 3,700 తండాలు పంచాయతీలుగా మారాయి.అయితే అక్కడ కూడా కొత్త రేషన్​ షాపులు మాత్రం మంజూరు కాలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube