బాబు- రేవంత్ కి కష్టాలు తప్పవా ...? కేసీఆర్ ఆలోచన ఇదేనా ..?

టీడీపీ అధినేత చంద్రబాబు ని తీవ్ర కలవరానికి గురిచేస్తున్న విషయం ఏదైనా ఉందా అంటే అది ఓటుకి నోటు కేసు ! హఠాత్తుగా తెలంగాణ నుంచి ఏపీకి చంద్రబాబు మూట ముల్లు సర్దుకుని వెళ్లిపోయే వరకు ఈ పరిణామం దారితీసింది.ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చంద్రబాబు … రేవంత్ రెడ్డి ఉన్నారు.

 Cm Kcr Targets Chandrababu And Revanth Reddy-TeluguStop.com

ఈ నేపథ్యంలో కేసీఆర్ తో ఎందుకొచ్చిన గొడవ అంటూ చంద్రబాబు సైలెంట్ గా ఉన్నా… రేవంత్ రెడ్డి మాత్రం టీఆర్ఎస్ విషయంలో దూకుడుగా వ్యవహరించాడు.అడుగడుగునా కేసీఆర్ ని ఇబ్బంది పెడుతూ వచ్చాడు.అలాగే… కేసీఆర్ కూడా రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెడుతూనే వచ్చాడు.ఈ లోపు ఎన్నికలు రావడంతో దొరికిందే అవకాశం అనుకుంటూ….

చంద్రబాబు కూడా టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి రాకుండా… శతవిధాలా ప్రయత్నించాడు.అయితే … ఫలితం మాత్రం బోల్తా కొట్టింది.

దీంతో బాబుకి కొత్త భయం పట్టుకుంది.కూటమి అధికారంలోకి వస్తుందనే ధీమాతో కేసీఆర్ ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాను కాబట్టి అవన్నీ మనసులో పెట్టుకుని కక్ష తీర్చుకుంటాడనే బాబుకి వణుకు మొదలయ్యింది.

ఒక వేల కూటమి అధికారంలోకి వచ్చింటే పరిస్థితి వేరే విధంగా ఉండేది.కాని కూటమి చిత్తుగా ఓడింది.

ఒక వైపు ఏపీలో సార్రత్రిక ఎన్నికల సమయం.మరో వైపు ఓటుకు నోటు కేసు భయం బాబును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

కూటమి అధికారంలోకి వచ్చునంటే ఓటుకి నోటు కేసు మరుగున పడదని బాబు ఆలోచించాడు.ఇక అసలు విషయానికి వస్తే ఎప్పటికైనా ఓటుకు నోటు కేసు బాబు మెడకు చుట్టుకోకతప్పదు.ఆ కేసు ఎంత వరకు వచ్చిందో తెలియదు.ఓటుకు నోటు కేసులో చంద్రబాబు, రేవంత్ లతో పాటు సండ్ర వెంకటవీరయ్య కూడా నిందితుడే.

ఓటుకు నోటు కేసులో ఈ ముగ్గురు నాయకులలో సండ్ర ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలోకి చేరేందుకు సిద్ధం అవుతుండడం … బాబులో మరింత కలవరం పెడుతున్నాయి.ఒక వేళ వీరయ్యకు ప్రభుత్వంలో ఏదైనా కీలక పదవి దక్కినా… కేసీఆర్ ఆదేశాల మేరకు ఓటుకు నోటు కేసు గురించి బాబు కి వ్యతిరేకంగా చెప్పినా.ఇరుకున పడాల్సిందే అన్న ఆందోళనలో బాబు ఉన్నాడు.ఇప్పుడు ఓటుకు నోటు కేసును తిరగతోడడం అంటూ జరిగితే … వీరయ్య టీఆర్ఎస్ కి అనుకూలంగా ఏదైనా స్టేట్ మెంట్ ఇస్తే… బాబు రేవంత్ ఇరుక్కోక తప్పదు.

మరో వైపు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ వేసిన పిటిషన్‌ను ఫిభ్రవిరిలో విచారిస్తామని ఇప్పటికే సుప్రీంకోర్టు తెలిపింది.అదే సమయంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో బాబు తీవ్ర ఆందోళన చెందుతున్నాడు.

ఇది ఇలా ఉంటే… అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరాలని కాంగ్రెస్‌ నేతలను పోలీసులు తనను వేధింపులకు గురి చేశారని… అందుకు నేను అంగీకరించనందుకే ఉద్దేశపూర్వకంగా తనిఖీల పేరుతో అర్ధరాత్రి దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేశారని రేవంత్‌రెడ్డి తరఫు న్యాయవాది ఉమ్మడి హైకోర్టుకు నివేదించారు.రేవంత్‌రెడ్డి ముందస్తు అరెస్టుకు సంబంధించిన పోలీసులు దాఖలు చేసిన కౌంటర్‌పై రేవంత్‌ తరఫు న్యాయవాది శనివారం రిప్లై దాఖలు చేశారు.తెలంగాణ లో ప్రస్తుత రాజకీయ పరిస్థితి చూస్తుంటే… టీఆర్ఎస్ ప్రభుత్వం దూకుడుగానే ముందుకు వెళ్లేలా కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube