పాజిటివ్ వేవ్ కోసం కేసీఆర్ ప్లాన్‌.. టార్గెట్ హుజూరాబాద్‌?

సీఎం కేసీఆర్‌కు ఉన్నంత ముందుచూపు మ‌రేనాయ‌కుడికి ఉండ‌ద‌ని అంద‌రికీ తెలిసిందే.ఆయ‌న ఏ ప‌నిచేసినా దానికి ఓ బ‌ల‌మైన కార‌ణం ఉంటుంది.

 Cm Kcr Targeting Huzurabad Constituency To Get Positive Wave From People-TeluguStop.com

ఇప్పుడు కూడా అలాంటి పెద్ద ప్లాన్ వేశారు కేసీఆర్‌.ఈట‌ల రాజేంద‌ర్‌ను మంత్రి వ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేసిన త‌ర్వాత కేసీఆర్ చాలా యాక్టివ్‌గా ప‌నిచేస్తున్నారు.

అనూహ్యంగా ఆస్ప‌త్రుల విజిట్‌, అలాగే స‌మీక్ష‌లు, మెడిక‌ల్ కాలేజీల ఏర్పాటు లాంటి అనేక నిర్ణ‌యాలు ఎవ‌రూ అడ‌గ‌కుండానే తీసుకుంటున్నారు.

 Cm Kcr Targeting Huzurabad Constituency To Get Positive Wave From People-పాజిటివ్ వేవ్ కోసం కేసీఆర్ ప్లాన్‌.. టార్గెట్ హుజూరాబాద్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వ‌రుస‌పెట్టి రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు గుడ్‌న్యూస్ చెబుతున్నారు.

అస‌లే క‌రోనా కార‌ణంగా నిధులు లేక‌పోయిన‌ప్ప‌టికీ కేసీఆర్ మాత్రం వెన‌క్కు త‌గ్గ‌ట్లేదు.పీఆర్సీ ఈ నెల నుంచి అమ‌లు చేయ‌డం, అలాగే 4.46 లక్షల మందికి రేషన్ కార్డులు మంజూరు, అన్ని జిల్లాల్లో డయాగ్నోస్టిక్ సెంటర్ల నెల‌కొల్ప‌డం లాంటి ప‌నులు పాజిటివ్ వేవ్ కోస‌మేన‌ని తెలుస్తోంది.త్వ‌ర‌లోనే హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక వ‌చ్చే అవ‌కాశం ఉంది.

దానికంటే ముందే రాష్ట్రంలో పాజిటివ్ వేవ్ సృష్టించేందుకు కేసీఆర్ సిద్ధం అవుతున్నారు.

ఈటల రాజేంద‌ర్‌కు ప్ర‌జ‌ల్లో ఇప్పుడు బాగా సింప‌తీ పెరిగిపోయింది.

దీన్ని దెబ్బ‌కొట్టాలంటే ఈగోకు పోకుండా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌రించాల‌ని కేసీఆర్ భావిస్తున్నారు.

Telugu @cm_kcr, Cm Kcr Targeting Huzurabad Constituency, Corona Second Wave, Eetala Rajendhar, Good News To Telangana People, Kcr Diagnostic Centers, Kcr Vs Etela Rajender, Positive Wave From People, Telangana Politics, Trs Party-Telugu Political News

ఒక‌వేళ ఈటల రాజేంద‌ర్ ను దెబ్బ కొట్టేందుకు హుజూరాబాద్‌కు స్పెష‌ల్‌గా నిధులు ఇస్తే.ఇన్ని రోజులు ఎందుకివ్వ‌లేద‌ని ప్ర‌తిప‌క్షాలు భ‌గ్గుమంటాయి.అందుకే రాష్ట్రం మొత్తం మీద కార్యక్రమాల్ని చేపట్టి పాజిటివ్ వేవ్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఈ కార్య‌క్ర‌మాల ప్రయోజనాలు ఎక్కువ‌గా హుజూరాబాద్ కు అందే విధంగా కేసీఆర్ చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.ఈ విధంగా ఈట‌ల‌ను డైరెక్టుగా టార్గెట్ చేయ‌కుండా ఇన్‌డైరెక్టుగా జెండా పాతాల‌ని గులాబీ బాస్ యోచిస్తున్నారు.

కాక‌పోతే ఈట‌ల‌ను దెబ్బ కొట్టాలంటే కేసీఆర్ బ‌లం మొత్తం ప్ర‌యోగిస్తున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది.ఎందుకంటే ఈట‌ల‌కు ఉన్న బ‌లం గురించి అంద‌రికంటే కేసీఆర్‌కే బాగా తెలుసు.ఏ మాత్రం నిర్ల‌క్ష్యం చేసినా రాష్ట్ర వ్యాప్తంగా వ్య‌తిరేకత వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది.

#@CM_KCR #KcrDiagnostic #PositiveWave #CmKcr #GoodNews

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు