కేసీఆర్ క‌ల రివ‌ర్స్ అయిన వేళ‌

తాను అనుకున్న‌ది సాధిస్తార‌ని, త‌న ప‌ట్టుద‌ల ముందు ఏదైనా త‌ల‌వంచాల్సిందేన‌ని పేరు తెచ్చుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా పెట్టుకున్న అతి పెద్ద ప్రాజెక్టు నుంచి వెన‌క్కి మ‌ళ్లిన‌ట్టు తెలుస్తోంది! వాస్త‌వానికి తెలంగాణ సాధాన కోసం అహ‌ర‌హం శ్ర‌మించిన కేసీఆర్‌.దీనికోసం అనేక సార్లు త‌న ఎంపీల‌తో స‌హా తాను కూడా రాజీనామాలు చేసి కేంద్రానికి షాక్ ఇచ్చారు.

 Cm Kcr Stopped New Telangana Secretariat Construction-TeluguStop.com

ఇక‌, తెలంగాణ సాధ‌న త‌ర్వాత ఎంద‌రో ఎన్నో విమ‌ర్శ‌లు గుప్పించినా, ఆందోళ‌న చేసినా.బంగారు తెలంగాణ ల‌క్ష్య సాధ‌న‌లో భాగంగా 10 జిల్లాల తెలంగాణ‌ను 31 జిల్లాల మ‌హా తెలంగాణ‌గా మ‌లిచారు.

జ‌ల ఒప్పందాల్లో భాగంగా రాష్ట్రానికి ప్ర‌యోజ‌నం చేకూర‌డ‌మే ల‌క్ష్యంగా ఎంద‌రో విమ‌ర్శిస్తున్నా.మ‌హారాష్ట్ర‌తోనూ ఒప్పందం చేసుకున్నారు.

ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు సైతం ఎదుర్కొన్నా.కేసీఆర్ వెన‌క్కి త‌గ్గ‌లేదు.

ఇక‌, తెలంగాణ విష‌యంలో చిర‌స్థాయిగా త‌న పేరు నిలిచిపోవాల‌ని భావించిన కేసీఆర్ ద‌శాబ్దాల కిందట నిర్మించిన ఉమ్మ‌డి స‌చివాల‌యాన్ని వాస్తు బాగోలేద‌ని పేర్కొంటూ.కూల‌గొట్టి.

వేరే చోట తెలంగాణ సంస్కృతి సంప్ర‌దాయాలు ఉట్టిప‌డేలా నూత‌న స‌చివాల‌యం నిర్మించాల‌ని భావించారు.

దీనిపైనా పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

ఒక‌రిద్ద‌రు కోర్టుకు కూడా వెళ్లారు.ప్ర‌స్తుతం కోర్టులో ఈ కేసు న‌డుస్తోంది కూడా.

అయినా.నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు స‌చివాల‌యం నిర్మాణానికి గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్న కేసీఆర్ … తాజాగా ఈ ప్ర‌తిపాద‌న‌ను అట‌కెక్కించారు.దాదాపు రూ.300 కోట్ల వ్య‌యంతో నిర్మించే ఈ స‌చివాల‌యానికి ప్ర‌ధానంగా రెండు అడ్డంకులు వ‌చ్చాయి.ఒక‌టి ఏపీ ప్ర‌భుత్వం పాత స‌చివాల‌యాన్ని కూల‌గొట్టేందుకు వ్య‌తిరేకిస్తుండ‌డం.ఈ క్ర‌మంలో మంత్రుల బృందాన్ని నియ‌మించిన చంద్ర‌బాబు.స‌చివాల‌యం కూల‌గొట్ట‌డంపై అధ్య‌యనం చేయించి.నివేదిక‌ను గ‌వ‌ర్న‌ర్‌కు అందించారు.

ఇది కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా ఉండ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, కేంద్ర ప్ర‌భుత్వం తాజా నిర్ణ‌యంతో పెద్ద నోట్లు ర‌ద్ద‌యిపోయాయి.

ఇది కూడా స‌చివాల‌య నిర్మాణంపై పెద్ద ఎత్తున ప్ర‌భావం చూపుతుంద‌ని అధికారులు కేసీఆర్‌కి విన్న‌వించారు.ఈ కార‌ణాల నేప‌థ్యంలో కేసీఆర్ త‌న క‌ల‌ల ప్రాజెక్టు విష‌యంలో వెన‌క్కి త‌గ్గార‌నే ప్ర‌చారం సాగుతోంది.

అయితే, ఇది తాత్కాలిక మేన‌ని కేసీఆర్ మాత్రం.తాను అనుకున్న‌ది సాధించే వ‌ర‌కు నిద్ర పోర‌ని ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు.

మొత్తానికి ఇప్ప‌టి వ‌ర‌కు అయితే, కేసీఆర్ మాత్రం వెన‌క్కి త‌గ్గారు.భ‌విష్య‌త్తులో ఏం జ‌రుగుతుందో తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube