తెలంగాణాలో వర్షాలపై సీఎం కేసిఆర్ సమీక్ష..!

తెలంగాణాలో భారీ వర్షాలపై సీఎం కేసిఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడటంతో కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో తీసుకుంటున్న జాగ్రత్తల గురించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

 Cm Kcr Review On Rains In Telangana, Heavy Rains In Telangana, Cm Kcr, Kcr About-TeluguStop.com

నిన్నటి నుండి భారీ వర్షాలు పడుతుండటంతో గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో వరద పెరుగుతుందని అధికారులు సీఎం కు చెప్పారు.ఈ క్రమంలో సీఎం కేసి ఆర్ సీఎస్ సోమేష్ కుమార్ తో పాటు నిజమాబాద్, ఆదిలాబాద్ జిల్లాల మంత్రులు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

ఆర్మీ హెలికాప్టర్ ద్వారా అధికారులు పరిశీలనకు వెల్లాలని చెప్పారు.ఎన్.డీ.ఆర్.ఎఫ్ బృందాలను కూడా పంపించాలని చెప్పారు. కృష్ణా నది ప్రవాహం పెరిగే అవకాశాలు ఉండటంతో నాగార్జున సాగర్ డ్యాం వద్దకు అధికారులను పంపించాలని చెప్పారు.

సహాయక చర్యల కోసం మరిన్ని హెలికాప్టర్లు అందించాలని.పెద్ద సంఖ్యలో ఎన్.

డి.ఆర్.ఎఫ్ బృందాలను రప్పించాలని అధికారులకు సూచించారు.ఆగష్టు 10 వరకు తెలంగాణాలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది.

అందుకే అందరిని అప్రమత్తం చేసేలా ప్లాన్ చేస్తున్నారు.హైదరాబాద్ లోతట్టు ప్రాంతాల్లో నిబంధనలు విరుద్ధంగా నిర్మించిన ఇళ్ల నిర్మాణాలపై కఠించగా వ్యవహరించాలని హెచ్.

ఎం.డీఏ, జి.హెచ్.ఎం.సి అధికారులను సీఎం కేసి ఆర్ ఆదేశించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube