ఎన్నారైల కోసం 50 కోట్లు...

మనవాళ్ళు ఎక్కడ ఏ దేశంలో ఉన్నా సరే వారి సంక్షేమం కోసం కృషిచేస్తాం.వారికోసం ఏం చేయడానికైనా సిద్దమే అన్నారు కేసీఆర్.

 Cm Kcr Releases 50crores Funds For Nris-TeluguStop.com

వివిధ దేశాలకి చెందిన ఎన్నారై ప్రతినిధులతో చర్చించిన కేసీఆర్ వారి సంక్షేమం కోసం 50 కోట్ల రూపాయలు కేటాయిస్తామని ప్రకటించారు.అంతేకాదు లంగాణ ఎన్నారైలకు సాయం చేసేందుకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి పర్యవేక్షణలో ప్రత్యేకంగా ఓ సెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

ఎన్నారై సెల్‌తోపాటు దానికి అనుబంధంగా కమిటీ ఏర్పాటు, అది పనిచేసే విధానంపై కార్యాచరణ రూపొందించే బాధ్యతలను మంత్రి కేటీఆర్‌, ఎంపీ కవితకు అప్పగించారు.ఎన్నారైల సమన్వయకర్త మహేష్‌ బిగాల తదితరులు పాల్గొన్నారు.ఎన్నారైల సంక్షేమానికి బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించామని, అందులో 50 కోట్లను ప్రత్యేక సెల్‌కు బదిలీ చేస్తామని సీఎం చెప్పారు.అవసరమైతే మరిన్ని నిధులివ్వడానికీ సిద్ధంగా ఉన్నామన్నారు.

అయితే దేశ రాజకీయాలపై ఎన్నారై లతో కేసీఆర్ చర్చించారు.దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం జరుగుతున్న ప్రయత్నాలను ప్రపంచ వ్యాప్తంగా చర్చకు పెట్టాలని తెలంగాణకు చెందిన ప్రవాస భారతీయులకు సీఎం పిలుపునిచ్చారు.తెలంగాణా అభివృద్దిలో సైతం మీరు పాలు పంచుకోవాలని కేసీఆర్ పులుపు ఇచ్చారు.

కేసీఆర్ ఈ పకతనతో తెలంగాణా ఎన్నారైలు అందరు సంతోషం వ్యక్తం చేసి కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube