ప్రియాంక ఘటనపై స్పందించిన కేసీఆర్  

Cm Kcr Reacts On Priyanka Reddy Incident-justice For Priyanka,priyanka Reddy Incident

షాద్ నగర్ లో జరిగిన ప్రియాంకా రెడ్డి అత్యాచారం, హత్య ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా స్పందించారు.గత నాలుగు రోజులుగా సంచలనంగా మారిన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వినిపిస్తున్నాయి.మహిళా లోకం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ప్రియాంకని చంపిన మానవ మృగాలకు నడిరోడ్డు మీద ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు.అదే సమయంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టాలలో మార్పు చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

Cm Kcr Reacts On Priyanka Reddy Incident-justice For Priyanka,priyanka Reddy Incident తాజా తెలుగు ఆంధ్ర ,తెలంగాణ రాజకీయ పొలిటికల్ బ్రేకింగ్ వార్తలు ..ఎలక్షన్ రిజల్ట్స్ విశ్లేషణలు ,రాజకీయ నాయకుల వివరాల-CM KCR Reacts On Priyanka Reddy Incident-Justice For Incident

ఇప్పటికి కూడా ప్రియాంక రెడ్డి మరణంపై తెలంగాణలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి.

మరోవైపు ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించలేదని విమర్శలు వినిపించాయి.ఈ నేపధ్యంలో తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రియాంక ఉదంతంపై తన ఆవేదనను వ్యక్తం చేశారు.ఇది అత్యంత అమానుషమైన దుర్ఘటన అని అన్నారు.

మహిళలు రాత్రి పూట ఉద్యోగులకు వెళ్లవద్దని సూచించారు.మానవ మృగాలు మన మధ్యనే తిరుగుతున్నాయని, మహిళలు చాలా జాగ్రత్తలు కోవాలని అన్నారు.తమ మొబైల్ లో 100 నెంబర్ తప్పక ఉంచుకోవాలని, అత్యవసర సమయాలలో 100కి కచ్చితంగా ఫోన్ చేయాలని సూచించారు.