కర్ణాటక గెలుపులో చక్రం తిప్పిన కేసీఆర్..       2018-05-20   03:56:00  IST  Bhanu C

తాజాగా జరిగిన కర్ణాటక రాజకీయాలు యావత్ దేశాన్ని ఎంతో ఉత్కంట కి లోనయ్యేలా చేశాయి..దేశం మొత్త కర్ణాటక రాష్ట్రం వైపే కొన్ని రోజులుగా ఫోకస్ పెట్టింది..యడ్యూరప్ప కేవలం మూడు రోజుల రెండు రోజులు సీఎం పదవిని చేపట్టి మళ్ళీ ఘోరమైన అవమానంతో వెనుదిరిగాడు..కాంగ్రెస్ ,జేడీయూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాయి..ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ జేడీయూ కలిసి కర్ణాటక లో సీఎం ఫీటంలో కూర్చున్నాయి అంటే దానికి ప్రధాన కారణం కేసీఆర్

కేసీఆర్ వేసిన డేర్ స్టెప్ వలన ఇప్పుడు బీజేపి కి భారీ నష్టం వాటిల్లింది..కేసీఆర్ చక్రం తప్పబట్టే కార్ణాటక కుర్చీ కాంగ్రెస్ వశం అయ్యింది.. యడ్యూరప్ప 55 గంటల లోపే దిగిపోవడానికి గల కారణాలలో ప్రధానమైన కారణం కేసీఆర్ అని అంటున్నారు..కాంగ్రెస్ జేడీయు కి కర్ణాటక లోకానీ మరే ఇతర రాష్ట్రాలో కూడా తమ ఎమ్మెల్యేలని దాచడానికి గానే వారికి సెక్యూరిటీ కల్పించడంతో కానీ అన్ని రాష్ట్రాలు వెనకడుగు వేశాయి చేతులు ఎత్తేశాయి..

అయితే తమ ఎమ్మెల్యేలను హైదరాబాదుకు తీసుకుని వచ్చిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తీసుకున్న చర్యలు ఆ పార్టీలకు పెద్ద యెత్తున ఉపకరించాయి. ఎమ్మెల్యేలు జారిపోకుండా కేసిఆర్ చేసిన వ్యూహాలు బీజేపి కి కోలుకోలేని దెబ్బ కొట్టాయి..ఎమ్మెల్యేల భద్రతలో ప్రభుత్వ యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది..కాంగ్రెసు ఎమ్మెల్యేలను తాజ్ కృష్ణాలో, జెడిఎస్ ఎమ్మెల్యేలను నోవాటెల్ హోటళ్లలో పెట్టారు.

ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రభుత్వం ఊహించని రీతిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది..శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఇతరులు ఎవరూ ఎమ్మెల్యేలతో టచ్ లోకి రాకుండా చూశారు.

జెడిఎస్ నేతలు దేవెగౌడతో, కుమారస్వామితో ఉన్న సత్సంబంధాల వల్లనే కేసిఆర్ ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది…అంతేకాదు ఫెడరల్ ఫ్రంట్ ని ముందుకు తీసుకుని వెళ్ళడం కోసం కూడా కేసీఆర్ దేవగౌడ్ కి సాయం చేసారని తెలుస్తోంది..

అంతేకాదు ఎప్పటి కప్పుడు పరిస్థితులని తెలుసుకోవడానికి స్టార్ హోటళ్ళ వద్ద ప్రత్యేక నిఘా బృందాలని సైతం కేసీఆర్ ఏర్పాటు చేయించారు.. మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ను బ్లాక్ చేయడానికి జామర్స్ ను ఏర్పాటు చేశారు. శిబిరంలోని ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరపకుండా కట్టు దిట్టమైన బద్రతా ఏర్పాటు టెక్నాలజీ పరంగా కూడా ఏర్పాటు చేశారు..అందుకే కర్నాటక సీఎం కుర్చీ కాంగ్రెస్ కూటమికి వెళ్ళడంతో కేసీఆర్ పాత్ర ఎంతో కీలకంగా మారింది అంటున్నారు విశ్లేషకులు.