రైతు తో ఫోన్ లో మాట్లాడి సమస్య పరిష్కరించిన సీఎం కేసీఆర్ , అసలు విషయం ఇదే...

సామాన్యుల సమస్యలు తెలుసుకొన్న వెంటనే అక్కడికక్కడే వారికి ఫోన్ చేసి ఆ సామాన్యుల సమస్యలను పరిష్కరించే ముఖ్యమంత్రులను మనం సినిమాల్లో చూస్తాం.అలాంటి ముఖ్యమంత్రులు మనకి ఉంటే ఎంత బాగుండేదో అనుకుంటాం.

 Cm Kcr Phone Call To Farmer Sharath Solved The Issue In Phone Call-TeluguStop.com

ఇలాంటి ఒక సంఘటనే తెలంగాణ లో జరిగింది.ఒక యువకుడు తన భూ సమస్య గురించి పై అధికారులని కలిసి విన్నపించుకున్న వారు పట్టించుకోక పోయే సరికి అతను తన ఆవేదనను తన మొబైల్ లో రికార్డ్ చేసి సోషల్ మీడియా లో పెట్టాడు , ఆ వీడియో వైరల్ అయి ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి వరకు వెళ్ళింది .అసలు జరిగిన విషయం ఇదే…

కేసీఆర్ హయం లో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భూప్రక్షాళన కార్యక్రమం చేపట్టింది.ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూ రికార్డుల సమస్యను పరిష్కరించడంతో పాటు రైతు బంధు, రైతు బీమా పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు భూముల సర్వే చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు అమలుచేశారు.

రైతుల భూములకు ఎటువంటి నష్టం జరగకూడదని మంచి ఉద్దేశం తో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని కొందరు అధికారులు పక్కదారి పట్టించారు.ఇప్పటి వరకు చాలా మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందలేదు.

వచ్చినా అందులో ఎన్నో తప్పులు ఉన్నాయి.అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పరిష్కారం దొరకడం లేదు.

ఈ క్రమంలో మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ యువరైతు సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకున్నాడు.తమ సమస్యపై వీడియో రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో పరిష్కారం దొరికింది.

ఏకంగా సీఎం కేసీఆర్ కలగజేసుకొని ఆ రైతుకు న్యాయం చేశారు.స్వయంగా రైతుతో ఫోన్‌లో మాట్లాడి ఏళ్ల తరబడి ఉన్న ఆ సమస్యను పరిష్కరించారు.

మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం అందుగులపల్లికి చెందిన రైతు శరత్‌కు సొంతూరులో కొంత పొలం ఉంది.ఐతే అందులో ఏడు ఎకరాలు పట్టాదార్ పాసుపుస్తకంలో నమోదుకాలేదు.ఆ భూమిని వేరొకరి పేరు మీద రెవెన్యూ అధికారులు పట్టాచేశారు.అందుకోసం భారీ మొత్తంలో ముడుపులు తీసుకున్నట్లు సమాచారం.తనకు జరిగిన అన్యాయంపై రైతు శరత్ ఎన్నోసార్లు అధికారులను కలిసినా ప్రయోజనం లేకపోయింది.ఇక ఏం చేయాలో తెలియని పరిస్థితి లో తన ఆవేదనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

అది చివరకు కేసీఆర్‌ వరకు వెళ్లడంతో ఆయనే స్వయంగా శరత్‌కు ఫోన్‌చేసి సమస్యను తెలుసుకున్నారు.సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్.

శరత్‌తో మాట్లాడిన సీఎం.సమస్య పరిష్కారం అయిన వెంటనే తన స్పందనను తన ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేయాలని సూచించారు.తద్వారా ఇలాంటి బాధితులు ఎవరున్నా.చర్యలు తీసుకుంటారనే భరోసా కలుగుతుందని చెప్పారు.త్వరలోనే ధరణి వెబ్‌సైట్‌ను ఆవిష్కరిస్తామని.ఆ తర్వాత రైతులకు ఇలాంటి సమస్యలు ఉంటే వెనువెంటనే పరిష్కారం చేస్తామని సీఎం వివరించారు.

ఎన్నికల కోడ్ కారణంగా ధరణి వెబ్‌సైట్‌ను ఇప్పటికిప్పుడు అందుబాటులోకి తీసుకురాలేకపోతున్నామని తెలిపారు.శరత్‌కు రైతు బంధు పథకం కూడా వర్తింపజేయాలని కలెక్టర్‌ భారతిని సీఎం ఆదేశించారు.

కేసీఆర్ ఆదేశాల మేరకు మంచిర్యాల కలెక్టర్ అందుగులపల్లిని సందర్శించి రైతు శరత్‌ను కలిశారు.సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఐతే రైతు శరత్‌తో కేసీఆర్ మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube