ప్రగతి భవన్‌ కుక్క వివాదం, సోషల్‌ మీడియాలో రచ్చ  

Cm Kcr Pet Dog Died In Pragathi Bavan-pragathi Bavan Dog

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో గత కొన్ని నెలలుగా ఉంటున్న హస్కీ అనే కుక్క అనారోగ్యంతో మృతి చెందింది.ఆ కుక్క విషయం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో దుమారం రేపడంతో పాటు, ప్రతిపక్ష నాయకులకు అధికార పార్టీ నాయకులపై విమర్శలు గుప్పించేందుకు మంచి అస్త్రంగా మారింది.

Cm KCR Pet Dog Died In Pragathi Bavan-Pragathi Bavan

అసలు విషయం ఏంటంటే ప్రగతి భవన్‌లో ఉన్న 11 నెలల హస్కీని వైధ్యులు సరిగా పట్టించుకోని కారణంగా అది చనిపోయింది.కుక్క ఆరోగ్యం పట్ల పుశువైధ్య శాఖ వారు సరైన సమయంలో స్పందించలేదు.

దాంతో పోలీసులు కుక్క చావుపై కేసు నమోదు చేశారు.

Cm KCR Pet Dog Died In Pragathi Bavan-Pragathi Bavan

కుక్క మృతి చెందడంకు ప్రధాన కారణం వైధ్యులు అంటూ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఈ విషయమై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.విష జ్వరాల వల్ల తెలంగాణలో ప్రతి రోజు ఎక్కడో ఒక చోట మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి.

కాని ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా కేవలం కుక్క మరణంపై మాత్రం కేసు పెట్టడం విడ్డూరంగా ఉంది అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ వస్తున్నాయి.ఇక ఇదే విషయంపై కాంగ్రెస్‌ నేత, ఎంపీ రేవంత్‌ రెడ్డి ఘటుగా స్పందించాడు.

బంగారు తెలంగాణలో కుక్కలకు ఉన్న ప్రాముఖ్యత మనుషులకు లేకుండా పోయిందన్నాడు.ఒక వైపు ప్రజలు రోగాలతో అల్లాడుతుంటే కుక్క చావుకు కేసు నమోదు చేసి ప్రభుత్వ ప్రాముఖ్యత ఏంటో చెప్పకనే చెప్పారని అసహనం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు