దడ పుట్టిస్తున్న దుబ్బాక ? ఎంట్రీ ఇవ్వబోతున్న కేసీఆర్ ?  

kcr is coming to dubaka election campaign which is putting tension on all parties kcr ,ktr ,dubbaka elections, congress, bjp, trs ,janasena ,solipeta ramalingareddy mla ,pavan kalyan - Telugu Bandi Sanjay, Congress, Dubbaka, Elections, Kcr, Ktr, Solipeta Ramalingareddy, Trs

దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని పార్టీలు పడరాని పాట్లు పడుతున్నాయి.ఇక్కడ గెలుపును అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని గట్టిగా కష్టపడుతున్నాయి.

TeluguStop.com - Cm Kcr Is Coming To Dubaka Election Campaign Which Is Putting Tension On All Parties

ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఎవరు అధికారం దక్కించుకోగలిగితే, వారికే 2023 ఎన్నికల్లోనూ అవకాశం ఉంటుందనే సెంటిమెంట్ ఇప్పుడు వెంటాడుతుండడంతో నేతలు గట్టిగానే కష్టపడుతున్నారు.ఇక కాంగ్రెస్ కు ఇక్కడ వచ్చే ఫలితాలను బట్టి, ఆ తరువాత అవకాశం ఉంటుందా లేదా అనే విషయంలో క్లారిటీ రాబోతోంది.

ఈ ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ గెలవకపోయినా, మూడో స్థానానికి పడిపోయినా, ఇక కోలుకోవడం కష్టమనే అభిప్రాయాలు ఆ పార్టీ నేతల్లోనే ఉన్నాయి.ఇక బీజేపీ సైతం ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

TeluguStop.com - దడ పుట్టిస్తున్న దుబ్బాక ఎంట్రీ ఇవ్వబోతున్న కేసీఆర్ -Political-Telugu Tollywood Photo Image

తెలంగాణలో గతం కంటే బాగా బలం పుంజుకోవడంతో తమకు అధికారం దక్కుతుంది అనే ధీమా ఆ పార్టీ నాయకుల్లో కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే, అధికార పార్టీ టిఆర్ఎస్ ను ఈ ఎన్నికలు కలవరపెడుతున్నాయి.ఇక్కడ గెలుపు తమ ఖాతాలో వేసుకునేందుకు టిఆర్ఎస్ మంత్రి హరీష్ రావు అన్ని రకాల వ్యూహాలను సిద్ధం చేసుకుంటూ, క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, పార్టీ నాయకులను బుజ్జగిస్తూ టిఆర్ఎస్ కు ఆధిక్యం దక్కేలా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నా, కేసీఆర్ లో మాత్రం నమ్మకం కలగడం లేదట.అందుకే దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రచారానికి స్వయంగా కేసీఆర్ వస్తే కానీ పెద్దగా ఫలితం ఉండేలా కనిపించదు అనే అభిప్రాయానికి వచ్చారట.

 అయితే ఈ విషయం అధికారికంగా టిఆర్ఎస్ ప్రకటించకపోయినా, ఇప్పటికీ ఆ పార్టీ నేతలు మాత్రం కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, దసరా తర్వాత ఆయన దుబ్బాక నియోజక వర్గంలో పర్యటించి, ప్రత్యర్థులపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించి, టిఆర్ఎస్ పార్టీ గెలుపు తమ ఖాతాలో పడేలా చేయగలరు అనే నమ్మకం పెట్టుకున్నారు.

ఇక ఇప్పటికే కాంగ్రెస్ కీలక నాయకులంతా దుబ్బాకలోనే మకాం వేసి మరీ, పరిస్థితిని సమీక్షిస్తుండగా,బీజేపీ సైతం గట్టిగానే ప్రచారం చేస్తోంది.

అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ ఎన్నికల ప్రచారం లోకి తీసుకురావాలని ఆ పార్టీ భావిస్తోంది.ఇప్పటికే ఆయనతో మంతనాలు చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి.

అందుకే విపక్షాల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ, కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగితే, వార్ వన్ సైడ్ అవుతుందని, ఆ పార్టీ నాయకులు గట్టి నమ్మకమే పెట్టుకున్నారట.

#Bandi Sanjay #Elections #Congress #Dubbaka

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

Cm Kcr Is Coming To Dubaka Election Campaign Which Is Putting Tension On All Parties Related Telugu News,Photos/Pics,Images..

POLITICAL