కులానికో ఇన్‌చార్జి.. హుజూరాబాద్‌లో కేసీఆర్ రాజ‌కీయం!

ఈట‌ల రాజేంద‌ర్ విష‌యంలో మొద‌టిచెక్ నుంచి గులాబీ బాస్ చాలా వ్యూహాత్మ‌కంగా ఆలోచిస్తున్నారు.క‌నీసం ఈట‌ల‌పై విమ‌ర్శ‌లు చేసే బాధ్య‌త కూడా కొంద‌రికే అప్ప‌గించారంటేనే అర్థం చేసుకోవ‌చ్చు.

 Cm Kcr Is Appointing One In Charge For One Cast In Huzurabad Constituency-TeluguStop.com

ఈట‌ల రాజేంద‌ర్‌కు పార్టీలో ఎవ‌రూ మ‌ద్ద‌తుగా నిల‌బ‌డ‌కుండా ఉండేందుకు ఆయ‌న స‌న్నిహితుల‌తోనే వైరం పెట్టి రాజ‌కీయ దుమారం రేపారు కేసీఆర్‌.హ‌రీశ్‌రావును రంగంలోకి దింప‌డానికి కార‌ణం కూడా అదేనంట‌.

ఇక త్వ‌ర‌లోనే వ‌చ్చే హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో ఎలాగైనా గెలిచేందుకు కేసీఆర్ మాస్ట‌ర్ ప్లాన్ వేసిన‌ట్టు తెలుస్తోంది.

 Cm Kcr Is Appointing One In Charge For One Cast In Huzurabad Constituency-కులానికో ఇన్‌చార్జి.. హుజూరాబాద్‌లో కేసీఆర్ రాజ‌కీయం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నిన్న ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో జరిగిన కేబినెట్ మీటింగులో ఇదే అంశాల‌పై చ‌ర్చించిన‌ట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా హుజూరాబాద్ లో రాజ‌కీయ వ్యూహాల మీద‌నే ఫోకస్ పెట్టారు కేసీఆర్.ఈ క్ర‌మంలోనే హుజూరాబాద్‌లో మార్కు రాజకీయాల‌కు శ్రీకారం చుట్టురు.

ఇప్ప‌టికే హుజూరాబాద్‌లో ఉన్న కులానికో మంత్రిని ఇన్‌చార్జిగా పెట్టి వారికి బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు.అన్ని కులాల‌ను టార్గెట్ చేస్తూ కొంద‌రికి బాధ్య‌త‌లు అప్ప‌జెప్పారు.

నియోజ‌క‌వ‌ర్గంలోని దాదాపు ఐదు మండ‌లాల‌కు నిర్ధిష్టంగా టార్గెట్ వేసి ముగ్గురు ఎమ్మెల్యేల‌ను నియ‌మిస్తూ ఆదేశాలు జారీ చేశారు కేసీఆర్‌.

Telugu @cm_kcr, Appointing, Cm Kcr, Etal Rajender, Gangula Kamalakar, Hareesh Rao, Huzurabad Constituency, Mla Aruru Ramesh, Mla Peddireddy Sudarshan Reddy, One In Charge For One Cast, Telangana Politics-Telugu Political News

ప‌క్క నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యేలు అయిన వారికే ఈ బాధ్య‌త‌ల‌ను మోపారు.ఎమ్మెల్యే అరూరి ర‌మేశ్‌కు ఎస్సీల బాధ్య‌త‌ను, ఓసీ బాధ్య‌త‌ను ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుద‌ర్శ‌న్‌రెడ్డికి ఇచ్చారు.అలాగే ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి కూడా ఉంటాడు.

ఇక బీసీల బాధ్య‌త‌ను గంగుల క‌మ‌లాక‌ర్ తో పాటు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కూడాచూసుకుంటారు.మొత్తంగా నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌ల‌ను మంత్రి హ‌రీశ్‌రావు, ప్లానింగ్ క‌మిష‌న్ వైస్ చైర్మ‌న్ వినోద్‌కుమార్ చూసుకుంటారు.

ఈ విధంగా కేసీఆర్ అన్ని వ‌ర్గాల‌ను సెప‌రేట్ గా విభ‌జించి మ‌రీ టార్గెట్ ఇచ్చారు.త్వ‌ర‌లోనే వీరంద‌రూ త‌మ ప్లాన్‌ను వ‌ర్కౌట్ చేయనున్నారు.

అయితే కేటీఆర్‌ను మాత్రం ఈ వ్య‌వ‌హారాల‌కు దూరంగా ఉంచారు కేసీఆర్‌.

#Hareesh Rao #CM KCR #@CM_KCR #Etal Rajender #OneIn

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు