తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు..!!

తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి భారీగా ఉన్న సంగతి తెలిసిందే.సామాన్య ప్రజలతో పాటు రాజకీయ నాయకులు సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు.

 Cm Kcr Gives Key Directions To Telangana Medical Health Department , Kcr, Telang-TeluguStop.com

దీంతో కేసులు రోజురోజుకీ పెరుగుతూ ఉండటంతో హాస్పిటల్స్ లో కరోనా రోగులు బెడ్ కొరతతో పాటు ఆక్సిజన్ ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు .ఇలాంటి తరుణంలో తాజాగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖకు.కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్.మేటర్ లోకి వెళ్తే ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఫైర్ సేఫ్టీ పై సమీక్షించాలని ఆదేశించారు.

అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.గాంధీ, టిమ్స్ హాస్పిటల్స్ వద్ద ఫైరింజన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు.

ఆక్సిజన్ కొరత ఉండటంతో సైనిక విమానాల ద్వారా ఆక్సిజన్ సిలిండర్లు రాష్ట్రానికి వస్తున్నాయి కాబట్టి ఎక్కడా ఎటువంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.అదేవిధంగా ఇంట్లో చికిత్స పొందుతున్న వారిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని పేర్కొన్నారు.

కరోనా నిర్ధారణ పరీక్షల కిట్లు కొరత లేకుండా చూసుకోవాలని.తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కు సీఎం కేసీఆర్ తాజాగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube