హోమం కార్యక్రమాల్లో నిమగ్నమైన కేసీఆర్ దంపతులు

తెలంగాణా లో ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ రోజు ప్రారంభమైంది.ఈ ప్రాజెక్ట్ కారణంగా దాదాపు 12 జిల్లాల ప్రజల కు నీటిని అందించే బృహత్తర కార్యక్రమానికి తెలంగాణ సి ఎం కె చంద్రశేఖర్ రావు పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.

 Cm Kcr Couple In Homam In Medigadda1 1 1-TeluguStop.com

కాళేశ్వరం ప్రారంభోత్సవ క్రతువులో భాగంగా జల సంకల్పం చేసే హోమానికి సంబంధించి గురువారం సాయంత్రమే రుత్వికులు పూజలు ప్రారంభించినట్లు తెలుస్తుంది.ఈ క్రమంలో యాగశాల లో 40 మంది వేద పండితులు పూజల్లో పాల్గొన్నట్లు తెలుస్తుంది.

స్థల శుద్ధి, పుణ్యాహవచనం, దేవతామూర్తుల ఆరాధన తదితర కార్యక్రమాలు ఇప్పటికే పూర్తిచేశారు.ఉదయమే మేడిగడ్డకు చేరుకున్న సీఎం కేసీఆర్ దంపతులు జల సంకల్ప హోమ క్రతువులో పాల్గొన్నారు.

కాళేశ్వరం శంగేరి పీఠానికి చెందిన ఫణిశశాంక్‌ శర్మ, గోపీకృష్ణ ఆధ్వర్యంలో 40 మంది వేద పండితులు పూజలు చేస్తున్నట్లు తెలుస్తుంది.ఈ క్రమంలో ఏపీ సి ఎం వై ఎస్ జగన్ కూడా కొద్దీ సేపటి క్రితం మేడిగడ్డ చేరుకున్నారు.

తాడేపల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో వచ్చిన ఆయనకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్వయంగా కండువా కప్పి స్వయంగా ఆహ్వానించారు.సీఎం జగన్‌ వెంట మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌ లు కూడా ఉన్నట్లు తెలుస్తుంది.

-Political

అలానే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌ సైతం మేడిగడ్డకు రానున్నట్లు సమాచారం.ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సి ఎం కేసీఆర్ ఫడ్నవీస్ ను ఆహ్వానించినా సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఆయన మేడిగడ్డ చేరుకోనున్నట్లు తెలుస్తుంది.అనంతరం 10.30 గంటల నుంచి 11 గంటల మధ్య గవర్నర్ నరసింహన్ తో పాటు తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు మేడిగడ్డ బ్యారేజీ వద్ద పైలాన్‌ను ఆవిష్కరిస్తారు.ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే గవర్నర్, ముగ్గురు ముఖ్యమంత్రులు మేడిగడ్డ పంప్‌హౌస్‌ ఉన్న కన్నెపల్లికి హెలికాప్టర్‌లో చేరుకొని అక్కడ అప్పటికే కొనసాగుతున్న పూర్ణాహుతిలో పాల్గొని, సుగంధ మంగళ ద్రవ్యాలను హోమంలో వేసి, అనంతరం 6వ నంబర్‌ మోటార్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంచనున్నట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube