బీఆర్ఎస్ నాందేడ్ సభ నేడే ! అన్నీ భారీగానే 

దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక్కో రాష్ట్రంలో పట్టు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికి ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభను భారీ స్థాయిలో నిర్వహించి సక్సెస్ అయ్యారు.

 Cm Kcr Brs Party Nanded Meeting Arrangements,brs, Telangana, Telangana Governmen-TeluguStop.com

ఇక రెండో సభను మహారాష్ట్రలోని నాందేడ్ లో ఈరోజు నిర్వహిస్తున్నారు.ఈ సభను భారీగా నిర్వహించి మహారాష్ట్రలో పాగా వేసేందుకు కెసిఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు .

Telugu Brs, Brs Nanded, Cm Kcr, Cm Kcr Flexis, Hyderabad, Telangana-Politics

అందుకే ఎక్కడా  ఎటువంటి లోటుపాట్లు రాకుండా భారీగా ఈ సభ ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.అలాగే ఈ సభకు భారీ ఎత్తున జనాలను సమీకరించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.ఈ మేరకు గత వారం రోజులుగా బీఆర్ఎస్ కీలక నేతలు అంతా నాందేడ్ లోనే  మకాం వేశారు.బీఆర్ఎస్ రెండో సభను మహారాష్ట్ర లోని నాందేడ్ రైల్వే స్టేషన్ సమీపంలోని గురుద్వారా సచ్ ఖండ్  బోర్డు మైదాన్ లో నిర్వహించనున్నారు.

Telugu Brs, Brs Nanded, Cm Kcr, Cm Kcr Flexis, Hyderabad, Telangana-Politics

ఈ సందర్భంగా సభాస్థలి ప్రాంతంతో పాటు,  పట్టణంలోనూ భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.భారీ హోల్డింగులు, స్వాగత తోరణాలు,  బెలూన్ స్టిక్కర్లు భారీ ఎత్తున ఏర్పాటు చేశారు.అలాగే మహారాష్ట్ర వాసులను ఆకట్టుకునే విధంగా చాలావరకు మరాఠీ భాషలోనే ఫ్లెక్సీలను ఏర్పాటు చేయించారు.ఇక మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి,  ప్రభుత్వ విప్ బాల్క సుమన్,  ఎంపీ బీబీ పాటిల్,  బోధన్ , జుక్కల్, ముధోల్ , ఆదిలాబాద్ ఎమ్మెల్యే లు షకీల్ హనుమంత షిండే, విటల్ రెడ్డి , జోగు రామన్న టీఎస్ఐఐసి చైర్మన్ గ్యాధరి బాల మల్లు, సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్ మాజీ మంత్రి నగేష్ ఇలా చాలామంది నేతలే గత వారం రోజులుగా అక్కడ మకాం వేశారు.

కేసీఆర్ షెడ్యూల్ ఇలా.


Telugu Brs, Brs Nanded, Cm Kcr, Cm Kcr Flexis, Hyderabad, Telangana-Politics

ఆయన ఈరోజు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ లో 12.30 గంటలకు నాందేడ్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు.ప్రత్యేక కాన్వాయ్ లో సభా వేదిక సమీపంలోని ఛత్రపతి శివాజి విగ్రహం వద్దకు చేరుకుంటారు.

విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పిస్తారు.ఇక తరువాత గురుద్వారాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు.1.30 గంటలకు సభ స్థలికి చేరుకుంటాను.ఈ సందర్భంగా మహారాష్ట్ర కు చెందిన కొంతమంది నేతలకు బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారు.ఆ తరువాత ప్రసంగాన్ని ప్రారంభిస్తారు.2:30 గంటలకు సభ స్థానం నుంచి సిటీ ఫ్రైడ్ హోటల్ కు చేరుకొని అక్కడ భోజనం చేస్తారు.సాయంత్రం నాలుగు గంటల సమయంలో జాతీయ స్థానిక మీడియా ప్రతినిధులతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తారు .సాయంత్రం ఐదు గంటలకు తిరిగి హైదరాబాద్ కు వచ్చేలా ఆయన షెడ్యూల్ ఉండబోతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube