మోడీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న కేసీఆర్‌?

తెలంగాణ సీఎం కేసీఆర్‌ గత కొన్నాళ్లుగా థర్డ్‌ ఫ్రంట్‌ అంటూ ఉరుకులు పరుగులు పెట్టిన విషయం తెల్సిందే.పలు రాష్ట్రాలకు వెళ్లి మూడవ కూటమికి సంబంధించిన చర్చలు జరపడం జరిగింది.

 Cm Kcr Behavior Like Favor To Pm Modi-TeluguStop.com

కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రత్యామ్నాయ కూటమి వచ్చి తీరాలి అంటూ గట్టి ప్రయత్నాలు చేసిన కేసీఆర్‌పై కాంగ్రెస్‌ నాయకులు మొదటి నుండి విమర్శలు చేస్తూనే ఉన్నారు.కేసీఆర్‌ మూడవ కూటమి బీజేపీకి అనుకూలం అంటూ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు.

కాంగ్రెస్‌ నాయకులు అన్నట్లుగానే కేసీఆర్‌ మూడవ కూటమి బీజేపీ అధినాయకత్వంకు అనుకూం అయ్యి ఉంటుందనే అనుమానాలు ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో వ్యక్తం అవుతున్నాయి.

ఒక వైపు ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వంపై యుద్దం ప్రకటించిన నేపథ్యంలో కేసీఆర్‌ మాత్రం ప్రధాని మోడీతో భేటీల మీద భేటీలు అవుతున్నారు.రహస్య భేటీలు మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం భేటీలు అంటూ మోడీతో కేసీఆర్‌ భేటీ అవ్వడం చర్చనీయాంశం అవుతుంది.తృతీయ ఫ్రంట్‌ అంటూ కేసీఆర్‌ ప్రకటించిన తర్వాత మోడీతో భేటీ అవ్వడం అందరి దృష్టిని ఆకర్షించింది.

అయితే అంతా అనుకున్నట్లు ఏమీ లేదు.సహజంగా అయితే తమకు వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నందుకు కేసీఆర్‌పై మోడీ సీరియస్‌గా ఉండటంతో పాటు, ఖచ్చితంగా అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం కుదరదు అని చెప్పిస్తాడు.

కాని అపాయింట్‌మెంట్‌ ఇవ్వడంతో పాటు, కేసీఆర్‌తో రహస్యంగా కూడా మోడీ మాట్లాడారు.

మోడీ, కేసీఆర్‌ల మద్య రహస్యంగా సాగిన చర్చలు వచ్చే ఎన్నికల గురించి అయ్యి ఉంటాయి అంటూ విశ్లేషకులు అంటున్నారు.

మూడవ కూటమి లేదా తనకు మిత్రులుగా ఉన్న వారిని బీజేపీకి మద్దతుగా నిలుపుతాను అంటూ మోడీకి కేసీఆర్‌ హామీ ఇచ్చాడు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.మీడియాలో కూడా మోడీతో కేసీఆర్‌ చెట్టాపట్టాల్‌ వేసుకుని తిరుగుతున్నట్లుగా ప్రచారం చేస్తుంది.

మొత్తానికి కేసీఆర్‌ మూడవ ఫ్రంట్‌ అంటూ కొందరిలో ఆశలు కల్పించాడు.కాని ఆ ఆశలు అడియాశు అయ్యే అవకాశం కనిపిస్తుంది.

ఇప్పటికే పలువురు ప్రాంతీయ పార్టీల అధినేతలను కలుసుకున్న కేసీఆర్‌ మూడవ ఫ్రంట్‌కు అనుకూలంగా ఒప్పించి, ఎందుకు ఇలా మోడీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు అంటూ కొందరు పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తన ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకు వచ్చేలా కేసీఆర్‌ మూడవ ఫ్రంట్‌ ప్రయత్నాలు అంటూ నాటకం ఆడారు అంటూ కొందరు కాంగ్రెస్‌ నాయకులు ఆరోపిస్తున్నారు.మొత్తానికి కేసీఆర్‌ మూడవ ఫ్రంట్‌ మోడీ వ్యూహం అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.2019 ఎన్నికల నాటికి అసలు మ్యాటర్‌ ఏంటీ అనే విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube