ఆర్టీసీ ఉద్యోగులకు కెసిఆర్ పండగ ఆఫర్... తాత్కాలిక ఉద్యోగులకి కూడా

తెలంగాణలో జరిగిన ఆర్టీసీ సమ్మె ఎంత ఉధృతంగా సాగిన అందరికీ తెలుసు.అయితే ప్రభుత్వం యూనియన్ డిమాండ్లకు తగ్గకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో యూనియన్ తమ సమ్మెను విరమించుకుంది.

 Cm Kcr Announces Huge Sops For Rtc Workers-TeluguStop.com

తర్వాత కెసిఆర్ క్యాబినెట్ లో చర్చించిన అనంతరం ఆర్టీసీ ఉద్యోగులు అందర్నీ కొంతకాలంగా ఉద్యోగంలో చేరమని చెప్పాడు.ఓవైపు ఆర్టీసీ యూనియన్లకు వార్నింగ్ ఇస్తూనే మరోవైపు ఉద్యోగులకు మాత్రం వరాల జల్లు కురిపిస్తున్నారు.

ఈ సమయంలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు 8 రోజుల్లో ఉద్యోగాలు ఇస్తానని తాజాగా కెసిఆర్ మీడియా సమావేశంలో ప్రకటించారు.దాంతోపాటు ఆర్టీసీ కార్మికుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లు సీఎం కేసీఆర్ తెలియజేశారు.

అలాగే సంస్థలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను కూడా పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారు.ప్రగతి భవన్ లో ఆర్టీసీ ఉద్యోగులతో సమావేశం అనంతరం కెసిఆర్ మీడియా ముఖంగా ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉంటుందని తెలియజేశారు.

అలాగే ఆర్టీసీ కార్మికులు ఉద్యోగ భద్రత విషయంలో భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.ప్రతి ఇద్దరు చొప్పున కార్మికులు సభ్యులుగా ఉండే ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించారు.

కేసీఆర్ ప్రకటన నేపథ్యంలో ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు.ప్రభుత్వం తమకు పండగ ఆఫర్ ఇచ్చిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube